వైయస్ జగన్ పార్టీలోకి 'ఎమ్మార్' కోనేరు ప్రసాద్?
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగుతోంది. కోనేరు ప్రసాద్ ఎమ్మార్ కేసులో నిందితుడు. అతను రెండు మూడు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట. కృష్ణా జిల్లా విజయవాడ నుండి పోటీ చేయనున్నారట. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు.
ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో...
ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం సమావేశంలో కొంత గందరగోళం ఏర్పడింది. వచ్చే నెలలో జగన్ తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు సమైక్యవాది అయిన జగన్‌ను ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. మిగతా వారు సర్ది చెప్పారు.

మరోవైపు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. చింతపూడి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజారావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.
2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన ఆయన జగన్ వైపు వెళ్లారు. జగన్ వైఖరితో గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న రాజారావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications