నిహారిక విడాకుల వెనక ఉన్న అసలు వ్యక్తి?
నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకుల వ్యవహారమే నాలుగు రోజులుగా మీడియాలో హైలైట్ అవుతోంది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక విడిపోవడానికి కారణం ఆమె తండ్రి నాగబాబు చేసిన అతి గారాబమే కారణమని తెలుస్తోంది. తన కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచిన నాగబాబు ఆమె ఏది కోరినా కాదనకుండా అందించారు. వివాహమైన తర్వాత అత్తగారింట్లో ఎలా మసలుకోవాలో నేర్పలేదని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు వ్యాఖ్యానిస్తున్నారు.
చైతన్య, నిహారికకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అసలు వీరిద్దరూ విడిపోవడానికి నాగబాబే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. వివాహమైన తర్వాత అత్తగారింట్లో నిహారిక సర్ధుకుపోలేకపోయింది. దీంతో చైతన్య, నిహారిక చేత నాగబాబు వేరు కాపురం పెట్టించాడు. పెళ్లైన తర్వాత నటించే విషయంలో భర్త చైతన్యతో పాటు అత్తారింటి ఆంక్షలు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయమే భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కారణమైనట్లు తెలుస్తోంది.

ఆ మనస్పర్థలే చివరకు విడాకులకు దారితీశాయి. రాజీ కోసం నాగబాబు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకవైపు కూతురుకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. తాను చేసిన అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందంటూ తన సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం తానేనంటూ ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది.
వివాహమైన తర్వాత నిర్మాతగా నిహారిక వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. కొన్ని విజయాలను కూడా అందుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతగా నిలబడాలని ఆమె కోరుకుంటోంది. డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ లో నటించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.












Click it and Unblock the Notifications