చిరంజీవి నుంచైనా నేర్చుకోవాలిగా, పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి: నటుడు కోట
Recommended Video

పవన్ గురించి కోట శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ నుంచి అనుభవాలు నేర్చుకోవాలని ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై స్పందించారు.
పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి పార్టీ నుంచి అయినా నేర్చుకోవాలని, వాళ్ల అన్నకు ఏం జరిగిందో అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. అయినా మనకు (సినిమావాళ్లకు) రాజకీయాలు ఎందుకు అనే ఉద్ధేశ్యంతోనే తాను వెనక్కి వచ్చానని చెప్పారు.

నేనేమైనా పిచ్చోడినై రాజకీయాల నుంచి వెనక్కి వచ్చానా అన్నారు. ఆ వాతావరణం (రాజకీయాలు) సినిమా వాళ్లకు పడవని చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే విషయమై రజనీ వంటి పెద్దవాళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు, కుర్రాడు అయిన పవన్ అర్థం చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications