జగన్ 2.0 టీమ్: కోటంరెడ్డికి దక్కని చోటు, అభిమానుల ఆగ్రహాం.. తడాఖా చూపిస్తాం అంటూ..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంపై క్లారిటీ వచ్చింది. 25 మంది జాబితా బయటకు వచ్చింది. దీంతో పదవీ రానీవారు రగిలిపోతున్నారు. చివరి క్షణంలో ఆర్కే రోజా, అంబటి రాంబాబుకు అవకాశం లభించింది. కొత్త వారు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొడాలి నానికి అవకాశం లభించలేదు. అతనికి కార్పొరేషన్ పదవీ ఇస్తారని తెలుస్తోంది. నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవీ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ వరించలేదు. దీంతో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఈ సారి కూడా అవకాశం దక్కలేదని అంటున్నారు.
మంత్రివర్గ విస్తరణపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవీ కోసం తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదని అంటున్నారు. తను రెండోసారి గెలిచినా పరిగణలోకి తీసుకోలేదన్నారు. టీడీపీ ఆశచూపినా కోటంరెడ్డి ఆ పార్టీలోకి వెళ్లలేదని గుర్తుచేశారు. పార్టీ కార్యక్రమాలతో ప్రతి తలుపు తట్టినా సీఎం జగన్ గుర్తించలేదని కోటంరెడ్డి అనుచరులు అంటున్నారు.
అంతేకాదు కోటంరెడ్డికి మంత్రిపదవి రాకపోవడంపై తడాఖా చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. మంత్రి పదవీ ఎందుకు ఇవ్వలేదో కనీసం చెప్పే వారు కూడా లేరని మండిపడుతున్నారు. అనుచరులు, అభిమానులతో సమావేశం తర్వాత కోటంరెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలీ మరీ. లేదంటే ఏదైనా కార్పొరేషన్ పదవీ ఇస్తారా వెయిట్ చేయాలి.

శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు.. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొరకు చోటు లభించింది. విశాఖపట్టణం నుంచి గుడివాడ అమర్నాథ్, ముత్యాలనాయుడు, తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణకు అవకాశం లభించింది.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామికేబినెట్‌లో తిరిగి చోటు లభించింది.
ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున కేబినెట్‌లో అవకాశం కలిగింది. విడదల రజనీ, కాకాని గోవర్ధన్‌రెడ్డి, అంజాద్ బాషా.. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషా శ్రీచరణ్, తిప్పేస్వామి మంత్రులుగా రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారు.












Click it and Unblock the Notifications