‘నీవెంత! నీ బతుకెంత?: బాబు కాలర్ పట్టుకుంటావా?’

నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నెల్లూరు నగర టిడిపి అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తావా? అంటూ విరుచుకుపడ్డారు.

'నీవెంత.. నీ బతుకెంత' జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చొక్కా కాలర్ పట్టుకుంటానన్న జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా పుర్రెమాలతో ఉన్న జగన్ ఫ్లెక్సీని దహనం చేశారు.

Kotamreddy Srinivasulu Reddy fires at Jagan

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. అరాచకాలు, అక్రమాలు చేసే కుటుంబం వైయస్‌దైతే... అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న కుటుంబం చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు కాలర్‌ పట్టుకుంటానంటూ జగన్ వ్యాఖ్యానిస్తున్నారని, ఆయన కాలర్‌ కాదు కదా.. తమ పార్టీ కార్యకర్త జుట్టు కూడా పట్టుకునే దమ్ము కూడా లేదని అన్నారు.

చంద్రబాబును తిట్టిన గాలి జనార్ధనరెడ్డి బతుకు తెల్లారిందని, అదే గతి జగన్‌కు పడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీతోపాటు హోదా సాధనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ద్వారా సాగునీటి జలాలను అన్ని జిల్లాల కు మళ్లించి సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్న చంద్రబాబును విమర్శించడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+