చంద్రబాబుకు షాక్: బిజెపిలోకి కొత్తకోట దంపతులు?

Kothakota couple
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు కొత్తకోట దయాకర్‌రెడ్డి, ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే దంపతులు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశాలున్నాయని తెలిసింది. గత సాధారణ ఎన్నికలలో దయాకర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదే విధంగా దయాకర్‌రెడ్డి సతీమణి అయిన సీతా దయాకర్‌రెడ్డి అదే జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం నుంచి టిడిపి టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు.

ఇటీవలి కాలంలో రాష్ట్ర విభజన పట్ల పార్టీ నాయకత్వం ద్వంద వైఖరిని అవలంభిస్తోందనే అభిప్రాయంతో దయాకర్‌రెడ్డి వున్నారని తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో మహబూబ్‌నగర్‌ జిల్లాలో బిజెపి మరింతగా బలం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా వుండటంతో తెలంగాణ కోసం కట్టుబడి వున్న పార్టీగా బిజెపి పట్ల ఓటర్లలో సానుకూల వాతావరణం ఏర్పడిందనే అభిప్రాయంతో దయాకర్‌రెడ్డి దంపతులు వున్నట్టు సమాచారం.

జిల్లా కేంద్రంలో బిజెపి ఎమ్మెల్యే వుండగా, లోక్‌సభ అభ్యర్థిగా నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ద న్‌రెడ్డి పోటీ చేయనుండటం కూడా వారు మనసు మార్చుకునేందుకు దోహదపడనున్నదని అంటున్నారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం మాత్రం దయాకర్‌రెడ్డి దంపతులు పార్టీలోకి వస్తే సాధరంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరువురు ఎమ్మెల్యేలకు జిల్లాలో మంచి పేరు వుండటంతో వారిని ఎలాగైనా బిజెపిలోకి రప్పించేందుకు జిల్లా బిజెపి ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా వుండగా టిడిపి నుంచి మరికొందరు పార్టీ మారేందుకు సిద్దంగా వున్నారని ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+