కొడాలి నాని కోసం చేతులు కలిపిన టీడీపీ నేతలు

వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తామంటున్నారు ఇక్కడి పార్టీ నేతలు. గుడ్లవల్లేరులో టీడీపీ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రావి వెంకటేశ్వరరావుకు పార్టీ న్యాయం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థిని బలంగా ఢీకొట్టగలిగే నేత కావాలని రవీంద్ర అన్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రావికి ఎమ్మెల్సీ ఇస్తామనే హామీని చంద్రబాబు ఇచ్చారని కొల్లు తెలిపారు. ప్రతిసారి రావిని పార్టీ మోసం చేస్తోందంటూ కార్యకర్తలు నిలదీశారు. దీనికి బాధ్యత తనదని, స్టాంప్ పేపరుపై రాసిస్తాననన్నారు. రావికి మరోసారి అన్యాయం జరగనీయమని, అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. వందల కోట్లరూపాయల ప్రజా ధనాన్ని దిగమింగిన రాక్షసుడిని అంతమొందించి గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయడమే మన మొదటి లక్ష్యం కావాలన్నారు. దుష్ప్రచారాలు చేయడమే నానికి అలవాటని, అతని ఎత్తుగడలను తిప్పికొడదామని నియోజకవర్గ ఇన్ ఛార్జి వెనిగండ్ల రాము అన్నారు.

krishna district gudlavalleru tdp meeting

రావి త్యాగానికి తాను రుణపడి ఉంటానన్నారు. గుడ్లవల్లేరు మండలంలో కొసరాజు బాపయ్యచౌదరిని చిన్నచూపు చూస్తే సహించమంటూ పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా లేఖలను రవీంద్రకు ఇవ్వబోయారు. బాపయ్యచౌదరి వారిని వారించారు. తనను ఎవరూ చిన్నచూపు చూడటంలేదని, అందరం కలిసి పార్టీకోసం పనిచేద్దామని సర్దిచెప్పారు.

krishna district gudlavalleru tdp meeting

గుడ్లవల్లేరు మండలానికి సంబంధించినంతవరకు తమకు బాపయ్య మాటే శిరోధార్యమన్నారు. మొన్నటివరకు గుడివాడ నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన స్థానంలో వెనిగండ్ల రాముకు అవకాశం దక్కింది. ఇద్దరూ కలిసి పనిచేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని రావి రాముతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+