కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ ఆదర్శ వివాహం
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ (జేసీ) డాక్టర్ అపరాజిత సింగ్ సిన్వర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అపరాజిత సింగ్ అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్రకుమార్‌ను వివాహమాడారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో అపరాజిత-దేవేంద్ర కుమార్ పరస్పరం దండలు మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన దేవేంద్రకుమార్ హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

కాగా, అపరాజిత-దేవేంద్ర దంపతులకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత అధికారులుగా ఉన్న వ్యక్తులు ఇలా సాధారణంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, గతంలో కూడా పలువురు ఉన్నత అధికారులు ఇదే విధంగా ఆదర్శ వివాహం చేసుకున్నారు.
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచిన మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ pic.twitter.com/jbzJHIg5ur
— oneindiatelugu (@oneindiatelugu) August 9, 2023
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఏపీ కేడర్‌కు చెందిన మరో యువ ఐఏఎస్‌ల జంట వివాహం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్.. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్‌ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి వివాహం తిరుపతిలో జరిగింది. వారి బంధు మిత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నాగలక్ష్మి 2012 బ్యాచ్ ఐఏఎస్ కాగా, నవీన్ కుమార్ 2019 ఐఏఎస్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన జేసీగా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications