Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కృష్ణాజిల్లా అభ్యర్థులను ఖరారు చేసిన జగన్..ఆ మూడు స్థానాలు పెండింగ్..?

ఎన్నికలు దగ్గరపడే కొద్ది సీఎం జగన్ దూకుడు పెంచుతున్నారు. రాబోవు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు.గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని ప్రకటించి జగన్..దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు.తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించిన అభ్యర్థులను జగన్ ఫైనల్ చేసినట్టుగా సమాచారం.ఇప్పటికే విజయవాడకు సంబంధించిన ముగ్గరు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ.. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారని తెలుస్తుంది.

విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ , పశ్చిమ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్‌ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జగన్ ..మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే తిరిగి పోటీ చేయనున్నారు. గుడివాడ -కొడాలి నాని, గన్నవరం -వల్లభనేని వంశీ, నందిగామ -మొండితోక జగన్మోహన్‌రావు, జగ్గయ్యపేట -సామినేని ఉదయభాను, తిరువూరు- రక్షణ నిధి, నూజవీడు -మేక వెంకట ప్రతాప్ అప్పారావు, అవనిగడ్డ - సింహాద్రి రమేష్ బాబు పెనమలూరు -పార్థసారథి, పామర్రు- కైలే అనిల్ కుమార్‌లపేర్లు ఖరారు అయినట్టుగా సమాచారం.

ysrcp

ఇక బందరు నియోజకవర్గం నుంచి పేర్ని నాని స్థానంలో ఆయన కుమారుడు పేర్ని కిట్టు రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక మిగిలిన మూడు స్థానాలపై సస్పెన్స్ నెలకొంది. మైలవరం నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తిరిగి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించినప్పటికీ , ఆ సీటును మంత్రి జోగి రమేష్ కూడా ఆశిస్తున్నారు. దీంతో వీరిద్దరి ఎమ్మెల్యేల మధ్య పోరు నెలకొంది. గత కొంతకాలంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ysrcp

మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం నుంచి 2019లో విజయం సాధించారు. మైలవరం జోగి రమేష్ స్థానికం కావడంతో..ఆయన అక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ మైలవరం టికెట్ జోగి రమేష్‌కు కేటాయిస్తే.. పెడన నియోజకవర్గం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు నియోజకవర్గాలపై పార్టీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై పార్టీ అసంతృప్తితో ఉందని సమాచారం. ఇటీవల పార్టీ జరిపిన సర్వేల్లో ఆయన వెనుకంజలో ఉండటంతో..దూలం నాగేశ్వరరావుకు టికెట్ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి. మైలవరం, పెడన, కైకలూరు ఈ మూడు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను జగన్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. మరి వీరిలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైన ఉన్నాయేమో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+