బాలకృష్ణ పిఎ శేఖర్:కృష్ణమూర్తి నివేదిక, నివేదికలో ఏముంది? బాలయ్య ఎటు వైపు
హిందూపురం ఎంఏల్ ఏ బాలకృష్ణ పిఎ శేఖర్ వ్యవహరశైలిపై పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకుగాను పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్ కృష్ణమూర్తి .
హిందూపురం:హిందూపురం ఎంఏల్ ఏ బాలకృష్ణ పిఎ శేఖర్ వ్యవహరశైలిపై పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకొనేందుకుగాను పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్ కృష్ణమూర్తి తన నివేదికను పార్టీ నాయకత్వానికి అందించారు. ఈ నివేదిక ఆధారంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోనుంది.
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం టిడపికి కంచుకోట. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్ టి ఆర్ ఈ అసెంబ్లీ స్థానం నుండి పలుమార్లు పోటీచేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీచేసి విజయం సాధించాడు.
అయితే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి బాలయ్య తన వీలును చూసుకొని వస్తుంటాడు. పార్టీ కార్యక్రమాలతో పాటు, అభివృద్ది కార్యక్రమాలను బాలకృష్ణ పిఎ శేఖర్ పర్యవేక్షిస్లుంటాడు.అయితే బాలకృష్ణ పిఎ శేఖర్ వ్యవహరశైలిపై పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
బాలయ్య పిఎ శేఖర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నాయకులు విడిపోయారు.బహిరంగంగానే నాయకులు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకోవడం, ర్యాలీలునిర్వహించడం లాంటి ఘటనలకు పాల్పడ్డారు.

కృష్ణమూర్తి నివేదిక సమర్ఫణ
హిందూపురం నియోజకవర్గంలో చోటుచేసుకొన్న పరిణామాలపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించకూడదని ఆదేశాలను జారీ చేసింది.అయితే శేఖర్ వ్యవహరిస్తున్న తీరుపట్ల పార్టీ నాయకులు తీవ్రంగా మనస్థాపానికి గురయ్యారు. శేఖర్ ను పక్కనబెట్టాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.అయితే శేఖర్ కూడ తనను సమర్థించే నాయకులతో వ్యతిరేక వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం సంస్థాగత ఎన్నికల కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి రెండు వర్గాల నాయకులతో సంప్రదింపులు జరిపారు.ఈ మేరకు ఆయన తన నివేదికను మంగళవారం నాడు బాలకృష్ణకు అందించారు.

శేఖర్ వ్యవహరశైలిపై సీనియర్ల అసంతృప్తి
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ పిఎ శేఖర్ వ్యవహరిస్తున్న తీరుపట్ల పార్టీ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా శేఖర్ వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే శేఖర్ ను అక్కడి నుండి తప్పిస్తే తప్ప తమకు మనుగడ ఉండదనే అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.దీంతో శేఖర్ కు వ్యతిరేకంగా వారు గళం విప్పారు.

హిందూపురం గొడవపై బాబు సీరియస్
హిందూపురం నియోజకవర్గంలో చోటుచేసుకొన్న పరినామాలపై టిడపి అధినేత చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. హిందూపురం పరిణామాలపై బాలయ్యను పిలిపించి బాబు మాట్లాడారు. ఈ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. పార్టీకి కంచుకొట లాంటి హిందూపురం నియోజకవర్గంలో చోటుచేసుకొన్న పరిణామాలపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కృష్ణమూర్తి నివేదికలో ఏముంది?
హిందూపురం పరిణామాలపై పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల పాటు కృష్ణమూర్తి నియోజకవర్గంలో పర్యటించి రెండు వర్గాల అభిప్రాయాలను సేకరించారు. ఈ అభిప్రాయాల ప్రకారంగా ఆయన తన నివేదికను తయారు చేశారు. . ఈ నివేదికలో ఏముందనే విషయమై రెండు వర్గాలు ఆరా తీస్తున్నాయి. నివేదికను సమర్పించారా..బాలకృష్ణను కలిశారు. బాలయ్య ఎలా స్పందించారనే విషయాలపై కృష్ణమూర్తిని పార్టీ నాయకులు ఆరా తీశారు.

బాలయ్య హిందూపురం ఎప్పుడు వెళ్తారు?
పార్టీ నాయకులు రెండు వర్గాలు విడిపోయిన నేపథ్యంలో బాలకృష్ణ హిందూపురంలో పర్యటించలేదు. సినిమా షూటింగ్ ల కారణంగా బిజీగా ఉన్న బాలయ్య, ఆ తర్వాత ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.అదే సమయంలో శేఖర్ గొడవ తెరమీదికి వచ్చింది. ఈ తరుణంలో శేఖర్ వ్యవహరాన్ని తేల్చాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణమూర్తి కమిటీని ఏర్పాటు చేసింది టిడిపి. కృష్ణమూర్తి బాలయ్యతో ఈ విషయమై చర్చించారు.పార్టీ అధినేత బాబుతో కూడ కృష్ణమూర్తి ఈ విషయమై చర్చించే అవకాశం ఉంది. మరో వైపు హిందూపురం నియోజకవర్గంలో పర్యటనకు బాలయ్య ఎప్పుడు వస్తారా...తమ సమ్యలను చెప్పుకోవాలని నాయకులు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications