జగన్‌పార్టీలోకి నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు
హైదరాబాద్: ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ప్రిన్స్ మహేష్ బాబు బాబాయి అయిన ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆదిశేషగిరి రావు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సోదరుడు అయిన ఆదిశేషగిరి రావు పలు చిత్రాలను నిర్మించారు.

స్వతంత్ర అభ్యర్థిగా కన్నబాబు
కాంగ్రెస్ పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి, తనకు మధ్యే పోటీ అని ప్రకటించారు.
కన్నబాబును తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేందుకు గంటా శ్రీనివాస రావు విఫలయత్నం చేశారు. ఈ రోజు విశాఖలో వీరిద్దరి మధ్య చర్చలు జరిగినా సఫలం కాలేదు. మరోవైపు కన్నబాబును తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కూడా మంతనాలు సాగించింది. అనూహ్యంగా కన్నబాబు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
చదలవాడకు టిక్కెట్ ఇవ్వాలని ఆందోళన
తెలుగుదేశం పార్టీ నేత చదలవాడ కృష్ణమూర్తి అనుచరులు హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం ముందు ఆందోళన చేపట్టారు. తిరుపతి అసెంబ్లీ టికెట్‌ను చదలవాడకే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications