జాక్ పాట్ కొట్టేసిన కృతి శెట్టి
కస్టడీ సినిమా ఫెయిలవడంవల్ల నిర్మాతకన్నా ఎక్కువ నష్టపోయింది నాగచైతన్య. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లలో ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అయితే దర్శకుడు వెంకట్ ప్రభు మ్యాజిక్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలహీనతగా మారింది. దీంతో నాగచైతన్య అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. థాంక్ యు, లాల్ సింగ్ చద్దా తర్వాత ఇలాంటి ఫలితం కోసం ఎవరూ ఎదురు చూడరు. అయితే ఈ సినిమాకు సంబంధించి మరెవరికీ డ్యామేజ్ జరగలేదు.
దర్శకుడు వెంకట్ ప్రభు చేతికి కొత్తగా విజయ్ సినిమా వచ్చింది. సంగీత బాధ్యతలు యువన్ శంకర్ రాజాకే అప్పగించారు. ఇద్దరు కథానాయికలకు చోటుండే ఈ సినిమాలో ఒక కథానాయికగా కృతి శెట్టిని తీసుకుందామనే విధంగా నిర్ణయం జరిగిపోయింది. వరస ఫ్లాపులతో ఉన్న కృతికి అర్జెంట్ గా సూపర్ హిట్ సినిమా అవసరపడుతోంది. విజయ్ లాంటి స్టార్ హీరో చిత్రంలో చేస్తేనే అది సాధ్యమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ పక్కన అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. కస్టడీ సినిమా సమయంలో ఆమె ఫెర్మార్మెన్స్ నచ్చిన వెంకట్ ప్రభు విజయ్ కు స్వయంగా రికమెండ్ చేశారు.

ఈ సినిమాలో ఇతర పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తారో స్పష్టత రాలేదు. ప్రాజెక్టు గురించి ప్రకటన మాత్రం వచ్చింది. మలయాళంలో టోవినో థామస్ తో ఇప్పటికే కృతి శెట్టి ఓ సినిమా చేస్తోంది. తాజాగా తమిళంలో ఇలాంటి ఆఫర్ రావడం అంటే డబుల్ జాక్ పాట్ లాంటిదే. ఒకేసారి కోలీవుడ్, మల్లువుడ్ ఎంట్రీ ఇచ్చినట్లవుతుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే అందులో పనిచేసినవారికి ఎటువంటి ప్రయోజనం కలగదు. కానీ ఇక్కడ మాత్రం అందరూ జాక్ పాట్ కొట్టేస్తున్నారు. నాగ చైతన్య
తన తర్వాత ప్రాజెక్ట్స్ శివ నిర్వాణ, చందూ మొండేటిలతో చేయడం దాదాపు ఖాయమైంది.












Click it and Unblock the Notifications