మెగా ఇంటి కోడలు కాబోతున్న మరో హీరోయిన్?
లావణ్య త్రిపాఠీ తర్వాత మరో హీరోయిన్ మెగా ఇంటి కోడలు కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మాత్రం ఆమె విజయాలను అందుకోలేకపోయింది. స్టార్ హీరోల పక్కన నటించినా హిట్ దక్కకపోవడంతో నిరాశకు గురైంది. దీంతో ఈమధ్య గ్లామర్ డోసును పెంచింది.
ఉప్పెన సినిమా చేసే సమయంలో ఈ అమ్మడు వయసు 17. బాలనటిగా ఎన్నో యాడ్స్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ భామ వయసు 19. హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క చదువును కూడా కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేమిటంటే.. కృతిశెట్టి త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతోందని. ఉప్పెన సినిమా సమయంలోనే ఆ సినిమా హీరో వైష్ణవ్ తేజ్ తో ప్రేమలో పడిందని, ఈ జంట ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని చెబుతున్నారు.

అయితే ఇలాంటి రూమర్లు సృష్టించడానికైనా కొన్ని ఆలోచనలు, కొంత మేనర్స్ ఉండాలి. 19 సంవత్సరాల వయసులో ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తోంది. ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేయడం చాలా నీచమైన పని అని కృతి అభిమానులు చెబుతున్నారు. ఇటువంటి వార్తను ఎవరు వైరల్ చేస్తున్నారు? మీకేమన్నా అర్థం ఉందా? ఏం చేస్తున్నారో తెలియడంలేదా? అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం కృతిశెట్టి ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. ఈ రూమర్లకు ఈ జంట ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.












Click it and Unblock the Notifications