కృపామణి ఆత్మహత్య కేసులో మలుపు: ఏడు నెలలు లైంగిక దోపిడీ, నగ్న వీడియోలు

ఏలూరు: కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడైన గుడాల సాయి శ్రీనివాస్ ఇంట్లోనే ఆ ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సాయి శ్రీనివాస్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

అతన విశాఖపట్నం పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా అతని సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా తెలుస్తోంది. కృపామణి రాసిన సూసైడ్ నోట్‌ను, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిందితుల కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

పోలీసులు సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను విచారించారు. అతడికి చెందిన రెండు కార్లను, బైకును స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Krupamani suicide case: Accused sai Srinivas absconding

సాయి శ్రీనివాస్ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీనివాస్ ఇంటిలో లభించిన ఓ పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని చూసి పోలీసులే నివ్వెరపోయారట. చిన్నపాటి పెన్ డ్రైవ్‌లో వందలాది నగ్న వీడియోలతో పాటు న్యూడ్ ఫొటోలు గుట్టలు గుట్టలుగా ఉన్నట్టు కనుగొన్నారు.

కేవలం కృపామణినే కాకుండా, అనేక మంది మహిళలను శ్రీనివాస్ వేధించినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లైంది. ఏడు నెలలుగా లైంగిక దోపిడీకి పాల్పడుతూ అతను కృపామణి నగ్న వీడియోలు తీసినట్లు తెలుస్తోంది.

కృపామణి ఆత్మహత్య కేసులో గుడాల సాయి శ్రీనివాస్‌ను మొదటి ముద్దాయిగా పోలీసులు చేర్చారు. ఎ2గా కృపామణి తల్లి లక్ష్మిని, ఎ3గా తండ్రి రామలింగేశ్వర రావును, ఎ4గా రాజ్ కుమార్‌ను చేర్చారు. నలుగురు నిందితులపై సెక్షన్ 344, 306, 370 క్లాజ్ 1,2,3, 376 క్లాజ్1 కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కృపామణి కేసు విచారణాధికారిగా జంగారెడ్డి గూడెం డిఎస్పీ వెంకట్రావును నియమించారు. సాయి శ్రీనివాస్ మీద పీడి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

పవన్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న కృపామణిని వ్యభిచారం చేయాలని తల్లిదండ్రులు, సోదరుడు తీవ్రమైన ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెను రూ. 7 లక్షలకు సాయి శ్రీనివాస్‌కు విక్రయించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల వేధింపులు భరించలేక ఇటీవల కృపామణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించిది. వ్యభిచారం చేయాలని కృపామణిని సాయి శ్రీనివాస్ తీవ్రంగా వేధించాడు. తాను చెప్పినట్టు వినకపోతే నగ్న వీడియోలను నెట్‌లో పెడుతానని సాయిశ్రీనివాస్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+