జెండా ఊపి ‘సైక్లింగ్ రైడ్’ ప్రారంభించిన కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ సభ్యులు కోరినట్లుగానే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్ వరకూ 25 కిలోమీటర్ల స్ట్రెచ్‌లో సైక్లింగ్ కమ్ జాగింగ్ ట్రాక్ నిర్మాణ అవకాశాలను పరిశీలించాల్సిందిగా జిహెచ్ఎంసి కమిషనర్‌ను కోరనున్నట్లు తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. హెచ్‌బిసి ప్రపోజల్ సమంజసంగానే ఉన్నప్పటికీ దాని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన మీదట ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.
వికలాంగుడైన ఆదిత్య మెహతా తన ఆదిత్య మెహతా ఫౌండేషన్ ద్వారా తనలాంటి వికలాంగులకు నిధులు సమీకరించేందుకు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని ఖర్‌డంగ్‌లా వరకూ సైకిల్ పై సాహసోపేతమైన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 1వ తేదీన తన యాత్రకు శ్రీకారం చుట్టనున్న ఆదిత్య మెహతాకు సంఘీభావంగా ఓ సైకిల్ ర్యాలీని ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ'గా హైదరాబాద్‌ను మార్చడంలో తమవంతు పాత్రను హెచ్‌బిసి నిర్వరిస్తుందన్నారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. ఆదిత్య మెహతా ఇప్పుడు చేస్తున్న ఫీట్ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పారు. ఈ సైక్లింగ్‌లో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

సైక్లింగ్ రైడ్
ఆగస్టు 1వ తేదీన తన యాత్రకు శ్రీకారం చుట్టనున్న ఆదిత్య మెహతాకు సంఘీభావంగా ఓ సైకిల్ ర్యాలీని ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సైక్లింగ్ రైడ్
హైదరాబాద్ బై సైక్లింగ్ క్లబ్ సభ్యులు కోరినట్లుగానే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్ వరకూ 25 కిలోమీటర్ల స్ట్రెచ్‌లో సైక్లింగ్ కమ్ జాగింగ్ ట్రాక్ నిర్మాణ అవకాశాలను పరిశీలించాల్సిందిగా జిహెచ్ఎంసి కమిషనర్‌ను కోరనున్నట్లు తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు.

సైక్లింగ్ రైడ్
‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ'గా హైదరాబాద్‌ను మార్చడంలో తమవంతు పాత్రను హెచ్‌బిసి నిర్వరిస్తుందన్నారు. సైక్లింగ్ వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు.

సైక్లింగ్ రైడ్
ఆదిత్య మెహతా ఇప్పుడు చేస్తున్న ఫీట్ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పారు. ఈ సైక్లింగ్‌లో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications