ఏపీనే ఎంచుకునేవాళ్లం, కలిసున్నాం: కేటీఆర్ ఆసక్తికరం, షాకిస్తానన్న చంద్రబాబు
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో జాతీయ ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణలు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి.
దీనిపై కేటీఆర్ ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ర్యాంకులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్లో పొందుపర్చిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం చోరీ చేసిన వ్యవహారం గతంలో చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఏపీ కాపి కొట్టిందని గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని కేటీఆర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మేథో సంపత్తి రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

ఏపీ కాపీ కొట్టిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, అయితే ఒకటి మాత్రం వాస్తవమని, మొదటి ర్యాంకు ఎవరితో పంచుకుంటారని ఒకవేళ కేంద్రం అడిగి ఉంటే మేం ఏపీనే ఎంచుకునే వాళ్లమని, ఎంత కాదన్నా ఇన్నాళ్లు కలిసి ఉన్నామని, తెలుగు వాళ్లమని వ్యాఖ్యానించారు.
షాకిస్తానని చెప్పిన చంద్రబాబు
తాత్కాలిక ప్రలోభాలకు లోనై లేనిపోని కష్టాలు తెచ్చుకుంటే మీ పదవి కూడా ఊడిపోతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిక చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవ తక్కువగా చేస్తే ప్రజలు నమ్మరని, ఎన్నికల్లో ఓట్లు పడకపోతే పార్టీ కూడా మిమ్మల్ని భరించదని, అందుకనే, నాయకులకు, కార్యకర్తలకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నానని, ప్రజలకు మనం ఆదర్శంగా ఉండాలన్నారు.
ఒక రాష్ట్రంలో, నియోజకవర్గంలో, ప్రాంతంలో టిడిపి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకునే పరిస్థితి రావాలి తప్ప, వేలెత్తి చూపించే పరిస్థితి రావొద్దన్నారు. ఒకవేళ, వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే నేను కూడా నమస్కారం పెట్టే పరిస్థితి వస్తుందని, ఆ విషయం ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, ఫర్వాలేదులే మన సారే కదా అని ఎవరైనా అనుకుంటే మాత్రం, నేను కూడా వారికి షాక్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications