రాములమ్మపై కెటిఆర్, సీటు కాదంటే ఆ గన్ బాబుపైకి

Kalvakutnla Taraka Rama Rao
హైదరాబాద్: తమ పార్టీపై ఆరోపణలు గుప్పించిన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పైన తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం స్పందించారు. విజయశాంతి తమపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఆదరణ లేక ఆమె తమను అంటున్నారని, జగన్‌నే కాంగ్రెస్ వదల్లేదని, తప్పు చేసి ఉంటే తమను వదిలేదా అన్నారు.

తమ పార్టీ నుండి కె కేశవ రావు రాజ్యసభ సీటును ఆశిస్తున్నారన్నారు. కాంగ్రెసు నుండి ముగ్గురిని నిలబెడితే తాము కెకెను నిలబెడతామన్నారు. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీటు కోసం పోటీ ఉందని, ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు రాజ్యసభ సీటును ఆశిస్తున్నారని, పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయనకు అవకాశం ఇవ్వకుంటే ఇన్నాళ్లు తమపై ఎక్కు పెట్టిన గన్ అటు వైపు తిప్పుతారన్నారు.

పొట్టకూటి కోసం వెళ్లిన వారిపై దాడి చేయడం దారుణమని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. విజయవాడలో తెలంగాణ కార్మికులపై దాడి జరిగిందని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శైలజానాథ్ తీరు మార్చుకోవాలన్నారు.

తెలంగాణ ఉద్యమామన్ని, ప్రజలను హేళన చేస్తే ఖబడ్దార్ అన్నారు. దళితులపై దాడులు చేసే సంస్కృతి సీమాంధ్రదని, కారంచేడు, చుండూరు, పదిరికుప్పం సంఘటనలు ఎక్కడ జరిగాయన్నారు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది సీమాంధ్ర నేతలే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+