నాగార్జున ఫ్యాన్‌ని, ఆ యువ హీరోలు కూడా: కేటీఆర్
హైదరాబాద్: తనకు యువసామ్రాట్ అక్కినేని నాగార్జున అంటే చాలా ఇష్టమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. హైదరాబాదులోని తాజ్ డెక్కన్ హోటల్‌లో జరిగిన ఓ ప్రయివేటు కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పిచ్చాపాటిగా మాట్లాడారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇప్పటికీ సినిమాలను రెగ్యులర్‌గా చూస్తానని చెప్పారు. నాగార్జున ఒకప్పుడు తనకు ఫేవరెట్ హీరో అన్నారు. ఇప్పటి వారిలో మహేశ్ బాబు, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పారు. వారితో తనకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉందన్నారు.

కాగా, మెట్రోపొలిస్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ ఆకట్టుకునే విధంగా ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు అన్నారు.
పన్నులు, ఆదాయం విషయంలో పూర్తి పారదర్శకతను పాటిస్తామన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో ప్రతి వ్యక్తినీ భాగస్వామిని చేస్తామని అన్నారు. తెలంగాణకు సంబంధించిన సమగ్ర వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని, సర్వే సమాచారంతో అన్ని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications