కేసీఆర్, కేజ్రీవాల్ కాంబినేషన్‌లో కొత్త ఫ్రంట్- జగన్ కు ఆహ్వానం..!?

మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాల వైపు ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తనయుడు కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. జాతీయ రాజకీ యాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారని వెల్లడించారు. ఇందు కోసం బీజేపీ, కాంగ్రెస్ కు దూరంగా ఉన్న పార్టీలతో కలిసి కొత్త ఫ్రంట్ ఏర్పాటు పైన అంచనాలు పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యాయి. వైసీపీ అధినేత జగన్ ను ఆహ్వానిస్తారనే చర్చ వినిపిస్తోంది. దీంతో.. కేసీఆర్- జగన్ నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి జాతీయ రాజకీయాల్లో పాత్ర పైన తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి. తెలంగాణకే పరిమితం కాకుండా ఢిల్లీ పీఠాన్ని శాసించే స్థాయిలో కేసీఆర్ రీ-ఎంట్రీ ఉండబోతోందని, రానున్న రోజుల్లో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి దేశ రాజకీయాల్లో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ktr-says-kcr-to-play-active-role-in-national-politics-again-soon-leads-to-new-equations

దేశానికి కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని కేసీఆర్ నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించారని కేటీఆర్ గుర్తు చేశారు. పదేళ్ల బీజేపీ పాలన దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిందని చెప్పారు. కాగా.. దానికి సరైన ప్రత్యామ్నాయ అజెండాను రూపొందించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విశ్లేషించారు. దీంతో.. ప్రజలు ప్రాంతీయ పార్టీల వైపు ఆశగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ తో కలిసి వచ్చే పార్టీల పైన అంచనాలు మొదలయ్యాయి.

 కూటమిలో జెడ్పీ స్థానాలు ఎవరికెన్ని - ఎవరు ఎక్కడ...!!
కూటమిలో జెడ్పీ స్థానాలు ఎవరికెన్ని - ఎవరు ఎక్కడ...!!

కొత్త ఫ్రంట్ ఫలించేనా..

జాతీయ స్థాయిలో గతంలో కేసీఆర్ చేసిన ప్రయత్నాల వేళ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ నుంచి మద్దతు లభించింది. ఇక.. ఇప్పుడు డీఎంకే అధినేత స్టాలిన్ సైతం కాంగ్రెస్ కూటమి నుంచి దూరం అయ్యారు. ఈ ముగ్గురు నేతలతో కలిసి కేసీఆర్ ముందుకు సాగే అవకాశం ఉందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా వైసీపీ అధినేత జగన్ సైతం తటస్థ వైఖరితో ఉన్నారు. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్న కారణంగా జగన్ సైతం తమ ఫ్రంట్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుందని.. జగన్ తో కేసీఆర్ కు ఉన్న సాన్నిహిత్యం సైతం ఇక్కడ ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ నేతలు తమ అంతర్గత చర్చల్లో విశ్లేషిస్తున్నారు.

ఇక.. ఇండియా కూటమి.. బీజేపీతో విభేదించే పార్టీలను కేసీఆర్ కలుస్తారని చెబుతున్నారు. అయితే.. తెలంగాణ, ఏపీలో కేసీఆర్- జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం శ్రమించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు ఎంత వరకు ఫోకస్ చేస్తారు.. పరిస్థితులు కలిసి వస్తాయా.. సమీకరణాలు ఏ విధంగా మారుతాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+