ఎన్టీఆర్, లోకేష్ ఎవరు: చంద్రబాబుకు కెటిఆర్ ప్రశ్న

ఆ మేరకు ఆయన గురువారం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. తెలంగాణ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. మరో ఆరునెలల్లో ఎన్నికలు ఉండగా, ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నిస్తున్న చంద్రబాబు 2009 ఎన్నికలకు కేవలం ఆరునెలల ముందే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలత వ్యక్తం చేస్తూ లేఖ ఎలా ఇచ్చారని కెటిఆర్ ప్రశ్నించారు.
ఎన్నికలు ముగిసిన ఆరునెలల తరువాత డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఏర్పాటును కేంద్రం ప్రకటిస్తే, అర్థరాత్రి ఎలా ప్రకటిస్తారని అడ్డుపడ్డారని గుర్తుచేశారు. ఎన్నికల ముందు మీ పార్టీ తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధమైతే, ఇంత తాత్సారం చేసిన తరువాత కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబుకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడు నిర్ణయం వచ్చినా ఏదో ఒక సాకు చూపించి అడ్డుకోవాలని ప్రయత్నించడం మాట తప్పడం కాదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌ను నేనే నిర్మించానని చెబుతున్నారు, తొమ్మిదేళ్లలో హైదరాబాద్ నిర్మించిన మీరు పదేళ్లలో సీమాంధ్రలో అలాంటి నగరాన్ని నిర్మించలేరా? అని ప్రశ్నించారు. 1908లోనే హైదరాబాద్ దేశంలో 4వ స్థానంలో ఉంది, ఇప్పుడు కూడా అదే 4వ స్థానంలో ఉందని, మీరేదో గొప్పగా అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ మీ వల్ల బాగుపడిందా? హైదరాబాద్ వల్ల మీరు బాగుపడ్డారా? అత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications