చంద్రబాబు బర్త్‌డే నాడు కుప్పమోళ్లు అలా ప్లాన్ చేశారు..

CM Chandrababu Birthday: నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పుట్టినరోజు. 75వ జన్మదిన వేడుకలను జరుపుకొంటోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తోన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Kuppam artist created a portrait of CM Chandrababu with fingerprint impressions

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్న రాజకీయ, పరిపాలన అనుభవాల గురించి ఇందులో ప్రస్తావించారు. వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విజన్‌కు అనుగుణంగా పరిపాలన సాగించగలదక్షుడిగా ప్రశంసించారు.

చంద్రబాబును అనితరసాధ్యుడిగా, దార్శనికుడిగా అభివర్ణించారు పవన్ కల్యాణ్. ఆయనకు అన్ని రకాలుగా కుంగిపోయిన రాష్ట్రాన్ని తన అపార రాజకీయ, పరిపాలన అనుభవంతో పునరుజ్జీవింపజేశారని పేర్కొన్నారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ది అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం అనేది చంద్రబాబులాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.

అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం, వేగం అద్భుతమని ప్రశంసించారు.

Kuppam artist created a portrait of CM Chandrababu with fingerprint impressions

చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆయన సొంత నియోజకవర్గం కుప్పం ఓటర్లు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెరైటీగా జరుపుకొన్నారు. వేలిముద్రలతో చంద్రబాబు ఫొటోను వేశారు. ఉత్సాహంగా పండగ వాతావరణంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు.

తొలుత- స్థానిక ఆర్టిస్ట్ పురుషోత్తం చంద్రబాబు ఫొటోను గీశారు. అనంతరం ఆ ఫొటోపై అవుట్‌లైనర్‌గా టీడీపీ అభిమానులు, స్థానిక మహిళలు వేలిముద్రలను వేశారు. మొత్తం 2,000 మంది వేలిముద్రలతో ఈ ఫొటో రూపుదిద్దుకుంది. అనంతరం- ఈ చిత్రపటాన్ని ఓ ఆటో వెనుకల తగిలించి, ఊరంతా ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో పూజలు చేశారు టీడీపీ అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+