చంద్రబాబు ఎఫెక్ట్, కుప్పంలో ఇంకో వికెట్, గవర్నర్ కు రాజీనామా లేఖ పంపించి?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో అధికారులు వారి పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇలా ఎక్కువ రాజీనామాలు చేసిన వారిలో ఇంతకాలం వైసీపీకి వీరవిధేయులుగా ఉన్న అధికారులే ఎక్కువగా ఉన్నారు.

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఇప్పటికే పోలీసు అధికారులతో పాటు పలు శాఖల అధికారులపై వేటుపడింది. ఇక చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోటీపడి చివరికి పంతం నెగ్గించుకుని కుప్పంలో ఏర్పాటు చేసిన ద్రవిడ యూనివర్శిటీ వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ద్రవిడ యూనివర్శిటీ అనేక వివాదాలకు దారితీసింది.

Kuppam Dravida University Vice Chancellor Madhujyoti resigned from her post

ఇప్పుడు ద్రవిడ యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ఆమె పదవికి రాజీనామా చేశారు. గతంలో తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న మధుజ్యోతి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ద్రవిడ యూనివర్శి వైస్ చాన్సలర్ గా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని నియమిస్తూ వచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన ద్రవిడ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ గా మధుజ్యోతి బాధ్యతలు స్వీకరించారు. మధుజ్యోతి నియామకంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మారిపోవడం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కుప్పంకు చెందిన చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో ద్రవిడ యూనివర్శిటీలో ఇంతకాలం అధికారం చెలాయించిన అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ద్రవిడ యూనివర్శిటీ రిజిస్టార్ వేణుగోపాల్ రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేశారు. ద్రవిడ యూనివర్శిటీ రెక్టార్ అనురాధ కూడా ఇప్పటికే ఆమె పదవికి రాజీనా చేశారు.

Kuppam Dravida University Vice Chancellor Madhujyoti resigned from her post

వేణుగోపాల్ రెడ్డి, అనురాధ వారి రాజీనామా లేఖలను వైస్ చాన్సలర్ మధుజ్యోతికి అందించారు. వేణుగోపాల్, అనురాధ రాజీనామా లేఖలను అమోదించకుండా మధుజ్యోతి వాటిని ఉన్నతాధికారులకు పంపించారు. వేణుగోపాల్ రెడ్డి, అనురాధల రాజీరామా లేఖలను ఆమోదించకుండానే ద్రవిడ యూనివర్శిటీ వీసీ పదవికి మధుజ్యోతి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

కొలకలూరి మధుజ్యోతి ఆమె రాజీనామా లేఖను ఆంధ్రప్రదేశ్ గవర్నర కు పంపించారు. వైసీపీ హయామంలో పలు యూనివర్శిటీలకు వీసీలుగా, రిజిస్టార్ గా, రెక్టార్ గా నియమితుల అయిన చాలా మంది ఇప్పుడు ఒక్కొక్కరిగా వారి పదవులకు రాజీనామాలు చేసి వెళ్లిపోతున్నారు. ఈ విషయంపై స్థానిక మీడియా వివరణ కోరడానికి మధుజ్యోతిని సంప్రధించాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద ఇంతకాలం వివాదాలకు కారణం అయిన ద్రవిడ యూనివర్శిటీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+