కాపులపై జగన్ రూటు మారింది..: రెడ్డి నుంచి బదిలీ

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.

జగన్ 2.0 అంటూ ఇటీవలే ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్.. వైఎస్ఆర్సీపీలో చేరడం మరింత ఊపునిచ్చినట్టయింది. కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు సీనియర్లు వైసీపీ కండువా కప్పుకొంటారనే ప్రచారం సైతం జరుగుతోంది.

Kurasala Kannababu and Dadisetti Raja gets key posts in YSRCP

ఈ పరిస్థితుల మధ్య జగన్ మరోసారి సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారితో చర్చించారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్ర‌భుత్వంపై రోజు రోజుకు వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని గుర్తు చేశారు. చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల్లో మరింత ఎండ‌గ‌ట్టాల‌ంటూ పిలుపునిచ్చారు.

ఈ క్రమంలో వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు జగన్. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇతర స్ధానిక సంస్దల ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధ‌వారం జగన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు.

ఈ క్రమంలో కొత్త నియామకాలతోనూ దూసుకెళ్తోన్నారు వైఎస్ జగన్. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులకు పార్టీలో కీలక పదవులను ఇచ్చారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌ బాధ్యతలను అప్పగించారు. గతంలో విజయసాయి రెడ్డి ఈ స్థానంలో పని చేసిన విషయం తెలిసిందే.

సాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి తప్పుకోవడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. దీన్ని కాపు సామాజిక వర్గ నేతతో భర్తీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకడిగా పేరున్న కురసాల కన్నబాబుకు ఈ బాధ్యతలను అప్పగించారు.

కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మరో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను అపాయింట్ చేశారు జగన్. ఇప్పటివరకు ఈ స్థానంలో కురసాల కన్నబాబు పని చేశారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమించడంతో కన్నబాబు.. పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఫలితంగా- ఈ స్థానాన్ని దాడిశెట్టి రాజాతో భర్తీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+