బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు, సీటర్ గా అనుమతి - స్లీపర్ గా ఆల్ట్రేషన్...!!
కర్నూలు బస్సు ప్రమాద విచారణలో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. బస్సు నిర్వహణలో లోపాలను అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ వ్యవహారంలోనూ నాటకీయత చోటు చేసుకుంది. ఇక.. సీటర్ గా అనుమతి తీసుకున్న బస్సు యాజమాన్యం.. స్లీపర్ గా అల్ట్రేషన్ చేసి నడుపుతోంది. అదే విధంగా ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న మొబైల్ ఫోన్ల పార్మిల్ కూడా తీవ్రత పెరగటానికి కారణంగా గుర్తించారు. విచారణలో కీలక అంశాల పై ఫోకస్ చేసారు.
కర్నూలు లో ప్రమాదానికి కారణమైన బస్సు డీడీ01ఎన్ 9490 అనే రిజిస్ట్రేషన్ నంబరుతో ఉంది. అంటే కేంద్ర పాలిత ప్రాంతం డామన్- డయ్యూలో రిజిస్ట్రేషన్ అయింది. కానీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ)లో ఒడిశాలోని రాయగడ చిరునామా ఉంది. బస్సుకు బీమా ఒంగోలులో చేయించారు. మొత్తంగా చూస్తే ఈ బస్సుకు మూడు చోట్ల రిజిస్ట్రేషన్ మారినట్లు తేలింది.

కాగా.. వీకావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్‌ను 2018 మే 2న కొన్నారు. ఆగస్టు 8న తెలంగాణలోని మేడ్చల్ ఆర్టీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అప్పట్లో ఇది సీటర్ బస్. తెలంగాణ, ఏపీల్లో బస్సుల ఆల్ట్రేషన్‌కు అనుమతించడం లేదు. దీంతో తెలంగాణలో ఎన్వోసీ తీసుకొని, 2023 ఏప్రిల్ 26న ఈ బస్సును కేంద్రపాలిత ప్రాంతమైన దమణ్- దీవ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు.
హోమ్ ట్యాక్స్ తక్కువగా ఉండటంతో డామన్ - డయ్యూలో ఎన్వోసీ తీసుకొని, ఈ ఏడాది ఏప్రిల్ 29న ఒడిశాలోని రాయగడ ఆర్టీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ బస్‌కి ఇంకా ఒడిశా నంబరు కేటాయించలేదు. దమణ్- దీవ్ నంబరుతో కొనసాగుతోంది. వీకావేరి ట్రావెల్స్ యాజమాన్యానిది ఒంగోలు. అయితే దాని యజమాని వేమూరి వినోద్‌కుమార్ అని, రాయగడలో సాయిలక్ష్మీనగర్ చిరునామా చూపించి, ఈ బస్సుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఒంగోలె లోని ది న్యూఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బ్రాంచిలో ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈ బస్సుకి బీమా చేయించారు. సీటర్ బస్సుకు ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా ఆల్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. వీకావేరి ట్రావెల్స్‌కు 100కు పైగా బస్సులున్నాయి. యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ఈ బస్సులు ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నాయి.












Click it and Unblock the Notifications