మహిళా ఉద్యోగినిలకు లైంగిక వేధింపులు: డిఈఓ సుప్రకాశ్‌పై సస్పెన్షన్ వేటు

కర్నూలు: కృష్ణా, కర్నూలు డీఈవోలపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీకాకుళం రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ సొంత శాఖకు వారు బదిలీ అయ్యారు. అధికారులు బాధ్యతరహితంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శాఖలలో ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.

ఇటీవల కర్నూలు జిల్లాలో విద్యాధికారి సుప్రకాశ్ రాసలీలల అంశం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే అతడిపై వేటుపడింది. డీఈఓపైన రాసలీలల ఆరోపణలు రావడంతో రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. దీనిపై విచారణ జరపాలని మంత్రి గంటా శ్రీనివాస రావు గత మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

అంతకుముందు జిల్లా డీఈవో సుప్రకాష్ రాసలీలలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారం అయినట్లుగా వార్తలు వచ్చాయి. మహిళలతో అతడు మాట్లాడిన శృంగార సంభాషణలతో కూడిన ఆడియో, వీడియో దృశ్యాల క్లిప్పింగ్‌లు వాట్సాప్, మొబైల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Kurnool DEO suspended for sexual harassment

రెండు వారాల్లోగా డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్లు: గంటా

ఏపీలో రెండు వారాల్లోగా డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్లు ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. 1424 పాఠశాలలకు రేషనలైజేషన్ వర్తింపజేస్తామని విజయవాడలో చెప్పారు. ఉపాధ్యాయులకు ఏకీకృత నిబంధనలపై కమిటీ చర్చించిందనీ, డిటెన్షన్ విధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

8, 9 తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పదో తరగతిలో వెయిటేజీ ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్, తెలుగు విశ్వవిద్యాలయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి లీగల్ నోటీసు ఇస్తామని గంటా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+