కూటమి ప్రభుత్వ నిర్ణయానికి సీమ నేతల బ్రేక్..!?

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రాజధాని అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి నిర్మాణ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో సింగపూర్ భాగస్వామ్యంకు అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు తాజాగా కేంద్రాన్ని కోరారు. ఇక, కర్నూలులో ఉన్న న్యాయ కార్యాలయాలను అమరా వతికి తరలించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కర్నూలు జిల్లా నేతలు అభ్యంతరం చెబుతున్నారు.

కర్నూలు నుంచి అమరావతికి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను తరలించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కర్నూలు జిల్లా వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌ భాషకు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. కర్నూలుకు జగన్‌ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని ఒప్పించి వైయ‌స్‌ జగన్‌ కర్నూలుకు లా వర్సిటీని తెచ్చారని గుర్తు చేసారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Kurnool YSRCP leaders Opposed Govt decision over legal offices shifting to Amaravati

అధికారంలోకి వచ్చిన ప్రతీసారి చంద్రబాబు.. కర్నూలుకు నష్టం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లాను కాపాడుకుంటామని చెప్పారు. చంద్ర బాబు లా యూనివర్సిటీని తరలించుకుపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ హయాంలో కర్నూలులో ఏర్పాటు చేసిన న్యాయ పరమైన సంస్థలను అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వెనక్కితగ్గకపోతే న్యాయపరంగా, ప్రజా ఉద్యమాల ద్వారా ఎంత దూరమైనా వెళతామని వైసీపీ నేతలు స్పష్టం చేసారు.

ఇందు కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని పోతామని వెల్లడించారు. కర్నూలు నుంచి న్యాయసంస్ధలు అమరావతికి తరలించే ప్రయత్నాన్ని విరమించు కోవాలని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాం భూపాల్ రెడ్డి డిమాండ్ చేసారు. ఇక్కడి నుంచి సంస్థలు తరలిపోకుండా తామంతా పోరాడతామని వెల్లడించారు.న్యాయ సంస్ధలను ఎట్టి పరిస్ధితుల్లో ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదని కర్నూలు మేయర్ రామయ్య పేర్కొన్నారు. 1953 నుంచి కర్నూలు నష్టపోయిందన్నారు. శ్రీబాగ్‌ ఒడంబడికకు విరుద్దంగా కర్నూలుకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+