మిక్సీలో వేసి బాగా రుబ్బినా ఉపయోగం లేకుండా పోయింది!!
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొందరైతే సూపర్ అన్నారు.. మరికొందరు పెదవి విరిచారు. కథలో కొత్తదనం లేదని, విజయ్, సమంత మాత్రమే కొత్తగా కనిపించారనే కామెంట్స్ వచ్చాయి. రెండో అర్థభాగంలో చివరి 30 నిముషాలు పర్వాలేదన్నారు. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఎన్నడూ లేనివిధంగా ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవలేదు. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అదే.ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో బాగానే రాబట్టింది. థియేట్రికల్ బిజినెస్ దగ్గర బోల్తా కొట్టింది. థియేటర్లో ఖుషి సినిమాకు అంతగా లాభాలు రావడం లేదని తెలుస్తోంది. వారం దాటినా కూడా బ్రేక్ ఈవెన్ కాలేకపోతోంది. దీనిపై డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ వారం కూడా జవాన్ సినిమా ఫీవర్ ఉంటుందని, జనాలు కూడా జవాన్ సినిమాకే ఓటేస్తున్నారు. దీంతో ఖుషి మరింతగా డీలా పడేట్టు కనిపిస్తోంది. రూ.52 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మేశారు. రూ. 53 కోట్ల టార్గెట్ తో బరిలోకిది దిగిన ఖుషి ఇప్పటివరకు రూ.39 కోట్ల షేర్ ను రాబట్టిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇంకా రూ.14 కోట్లు రాబట్టాల్సి ఉంది. వచ్చింది కేవలం 73 శాతమే. జవాన్ కు మంచి టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఖుషి బ్రేక్ ఈవెన్ దాటుతుందో లేదో చెప్పడం కష్టమంటున్నారు. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఖుషి సినిమా స్ట్రీమింగ్ కానుందంటున్నారు. దీనిపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు. మూడు సినిమాలను కలిపి తీశాడనే విమర్శలు కూడా దర్శకుడిపై వచ్చాయి.












Click it and Unblock the Notifications