సాయిరెడ్డి పిచ్చికుక్క‌లా అరుస్తున్నారు : జ‌గ‌న్‌కు భ‌యం ప‌ట్టుకుంది : కుటుంబ‌రావు తీవ్ర వ్యాఖ్య‌లు.

వైసిపి నేత‌..రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి మీద ఏపి ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు కుటుంబ‌రావు తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. కొద్ది రోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం సాగుతోంది. సాయిరెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా విమ‌ర్శ‌లు చేస్తుంటే..కుటుంబ రావు మీడియా స‌మావేశాలు పెట్టి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక‌, సాయిరెడ్డి పైన కుటుంబ‌రావు ఈ రోజు చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత వేడి పుట్టించాయి.

Kutumba rao says Vijaya Sai reddy as Dog and he is not an auditor

పిచ్చి కుక్క‌లా అరుస్తున్నారు..
వైసిపి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పైన కుటుంబ‌రావు తీవ్ర వ్యాఖ్య‌లు కొన‌సాగిస్తున్నారు. రాష్ట్ర ఆర్దిక ప‌రిస్థితి పైన విజ‌య సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల పైన కుటుంబ రావు స్పందించారు. సాయిరెడ్డి పిచ్చి కుక్క‌లా అరుస్తున్నారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తనను స్టాక్ బ్రోకర్ అంటున్న విజయసాయిరెడ్డి.. ఆయన దొంగ ఆడిటర్ కాదా అని ప్ర‌శ్నించారు. విజయసాయిరెడ్డికి దమ్ముంటే ఆర్థిక అంశాలపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. బెయిల్‌పై వచ్చి బతుకుతున్న విజయసాయి రెడ్డి ఓ పిచ్చి కుక్క అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ పైనా ఆరోప‌ణ‌లు చేసారు. కేంద్రాన్ని నిధులు అడిగితే జైలు శిక్ష ప‌డుతుంద‌ని జ‌గ‌న్‌..సాయిరెడ్డికి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఎద్దేవా చేసారు. ప్ర‌భుత్వం చేస్తున్న ఖ‌ర్చుల గురించి అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని.. వారు చేస్తున్న వ్యాఖ్య‌లు సిగ్గు చేట‌ని దుయ్య‌బ‌ట్టారు.

బ్రోక‌ర్‌..దొంగ ఆడిట‌ర్ అంటూ..
ఏపిలో అర్దిక అంశాల పైన విజ‌య సాయిరెడ్డి కొద్ది రోజులుగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. దీనికి ప్ర‌తిగా కుటుంబ రావు స్పందిస్తున్నారు. ఆ స‌మ‌యంలో కుటుంబ రావు సాయిరెడ్డితో పాటుగా జ‌గ‌న్ పైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీరిద్ద‌రూ బెయిల్ ష‌ర‌తులు పాటిస్తున్నారా అంటూ ప్ర‌శ్నించారు. అదే విధంగా..ఇద్ద‌రి మ‌ధ్య ఆరోప‌ణ‌ల స్థాయి పెరిగి..కుటుంబ రావును విజ‌య‌సాయిరెడ్డి ఆయ‌న స్టాక్ మార్కెట్ బ్రోక‌ర్ అని విమ‌ర్శించారు. ఆర్దిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడా లేక కుటుంబ రావా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. త‌మ పైన ఆరోప‌ణ‌లు వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భం లోనూ కుటుంబ‌రావు వైసిపి ఎంపి సాయిరెడ్డి మీద విరుచుకుప‌డుతున్నారు. ఇక‌, ఈ రోజు ఆయ‌న పైన ప్ర‌యోగించిన తీవ్ర ప‌ద‌జాలంతో మ‌రింత వేడి పెరిగి..ఇది ఎక్క‌డి వ‌ర‌కు పోతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+