టైటానియం స్కాం: హైకోర్టుకు కెవిపి, ఇప్పుడే చూడమని

హైదరాబాద్: టైటానియం కుంభకోణం కేసులో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసుల నేపథ్యంలో కాంగ్రెసు సీనియర్ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు సహా ఇతరత్రా కఠినమైన చర్యలేవీ తీసుకోకుండా సిఐడిని నిలువరించాలని కోరారు. కెవిపి తరఫున న్యాయవాది ఎస్ సత్యప్రసాద్ వాజ్యం దాఖలు చేశారు.

అమెరికా కోర్టులో కెవిపిపై అభియోగాలు నమోదైనందున... ఆయన భారతదేశం విడిచి వెళ్లకుండా ప్రొవిజనల్ అరెస్టు చేయాల్సిందిగా సిబిఐ అధికారులను కోరుతూ ఎఫ్‌బిఐ ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ఆధారంగా తనను అరెస్టు చేయడంతో సహా, ఇతరత్రా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కెవిపి తన పిటిషన్‌లో కోరారు.

KVP files petition in High court

దీనిపై అత్యవసరంగా లంచ్ మోషన్‌లో వాదనలు వినాలని న్యాయమూర్తి జస్టిస్ నూతి రామమోహన రావు కోర్టును కోరారు. లంచ్ మోషన్‌లో విచారించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ అంశం అంతర్జాతీయ ఒడంబడికలకు సంబంధించిందని, ఇప్పటికిప్పుడే దీనిపై విచారణ చేపట్టలేమని, రెగ్యులర్ మోషన్‌లో రావాలని సూచించింది.

దీంతో కెవిపి తరపు న్యాయవాది తిరిగి పిటిషన్‌ను రెగ్యులర్ మోషన్‌లో దాఖలు చేశారు. ఇది హైకోర్టులో సోమవారం సాధారణ ప్రక్రియలో భాగంగా విచారణకు వచ్చే అవకాశముంది. పిటిషన్‌లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సిఐడి అదనపు డిజిలను ప్రతివాదులుగా చేర్చారు.

కాగా, టైటానియం ఖనిజ తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనపై బురద చల్లేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని కెవిపి చెప్పారు. అమెరికా ఫెడరల్ కోర్టులో తనపై కేసు నమోదైనట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ద్వారా మాత్రమే తనకు తెలిసిందన్నారు. తాను ఏ చట్టాలు ఉల్లంఘించలేదని చెప్పారు.

నోటీసు అందింది!

కెవిపిపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ నోటీసు సిఐడికి చేరింది. శుక్రవారం ఈ విషయాన్ని సిఐడి ద్రువీకరించింది. కెవిపిపై జారీ చేసిన నోటీసు సిబిఐ ద్వారా తమకు అందినట్లు సిబిఐ అదనపు డిజి కృష్ణప్రసాద్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+