దీక్ష: ఈ రోజు కెవిపి, నిన్న జై తెలంగాణ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంద్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు చేపట్టిన సంకల్ప దీక్ష శనివారం రెండో రోజు కొనసాగుతోంది. శనివారంనాడు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో కూర్చున్నారు.
కాగా, మొదటి రోజు శుక్రవారం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు అనూహ్యమైన సంఘటన ఎదురైంది. పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ప్రసంగిస్తుండగా ఓ యువకుడు జై తెలంగాణ నినాదాలు చేశాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఆయన శిబిరాన్ని సందర్శించి తన మద్దతు తెలిపారు. కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటు ప్రకటించిన ఆరుగురు పార్లమెంటు సభ్యులు దీక్షకు కూర్చున్నారు.

జై తెలంగాణ నినాదాలు..
చీటర్స్ అంటూ రాసి ఉన్న పోస్టర్‌ను ప్రదర్శిస్తూ ఓ యువకుడు సీమాంద్ర పార్లమెటు సభ్యుల దీక్షా శిబిరం వద్ద ఇలా జై తెలంగాణ నినాదాలు చేశాడు.

యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల దీక్షా శిబిరం వద్ద జై తెలంగాణ నినాదాలు చేసిన యువకుడిని పోలీసులు శుక్రవారంనాడు అదుపులోకి తీసుకున్నారు.

హర్ష కుమార్‌కు వైద్య పరీక్షలు
సంకల్ప దీక్ష చేస్తున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హర్షకుమార్‌ను పరీక్షిస్తున్న వైద్యుడు.

లగడపాటికి వైద్య పరీక్షలు
దీక్ష చేస్తున్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

అశోక్ బాబు సంఘీభావం..
సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల సంకల్ప దీక్షకు ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు సంఘీభావం ప్రకటించారు.

శైలజానాథ్ సంఘీ భావం
హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద సంకల్ప దీక్ష చేస్తున్న కాంగ్రెసు సీమాంద్ర పార్లమెంటు సభ్యులకు రాయలసీమకు చెందిన మంత్రి శైలజానాథ్ సంఘీభావం తెలిపారు.

దీక్షా శిబిరంలో ఇలా..
దీక్షా శిబిరంలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఇలా పడుకున్నారు. రాత్రంతా అక్కడే గడిపారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications