మోడీని నిలదీద్దామా: బాబుకు కేవీపీ లేఖ, వాస్తు.. బాబు 'దారి' మార్చారు

విజయవాడ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు మరోసారి లేఖ రాశారు. ప్రత్యేక హోదా పైన టిడిపి మహానాడులో తీర్మానం చేయాలని ఆయన బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

విభజన చట్టం అమలుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు సమష్టిగా పోరాడాలన్నారు. హోదా అంశంలో ప్రజల ఆందోళన, అయోమయం పైన స్పష్టత ఇవ్వాలన్నారు. హోదాపై అందరం కలిసి కేంద్రాన్ని నిలదీద్దామని సూచించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో హోదాపై ప్రయివేటు మెంబర్ బిల్లు చర్చకు వస్తుందన్నారు.

 KVP writes another letter to CM Chandrababu on Special Status to AP

ఓటుకు నోటు ముందుకెళ్లడం లేదు: గండ్ర

ఏడాది గడిచినా ఓటుకు నోటు కేసు ముందుకు వెళ్లడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. కాగా, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు అయి విడుదల కాగా, చంద్రబాబు పైన ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.

మహానాడు.. చంద్రబాబు ఎంట్రీ మార్గం మార్పు

తిరుపతిలో ఈ నెల 27 నుంచి మహానాడు ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ అధినేత హోదాలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభం నుంచి ముగింపు దాకా అక్కడే ఉంటారు. ఇందుకోసం రాత్రి తన సొంతూరు నారావారిపల్లెలో బస చేయనున్న ఆయన తెల్లారగానే మహానాడు వేదికకు చేరుకుంటారు.

టిడిపి నేతలు వాస్తుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో మహానాడులో జరుగుతున్న ఏర్పాట్లలో వాస్తు చూసుకుంటున్నారు. నెహ్రూ మునిసిపల్ మైదానంలో ఏర్పాటు చేస్తున్న వేదిక మీదకు చంద్రబాబు ప్రవేశించే మార్గం విషయంలో పార్టీ నేతలు వాస్తు పాటిస్తున్నారు. రుయా ఆసుపత్రి రోడ్డులోని పడమటి గేటు నుంచి చంద్రబాబు వేదిక మీదకు వచ్చేలా పోలీసులు ఇది వరకు ఏర్పాటు చేశారు.

అయితే వాస్తు ప్రకారం అది సరైనది కాదని పార్టీ నేతలు తేల్చారు. దీంతో ఈశాన్య దిశ నుంచి పార్టీ అధినేత వేదిక మీదకు వస్తే మేలు జరుగుతుందని భావించారు. ఇదే విషయాన్ని వారు చిత్తూరు ఎస్పీకి తెలిపారు. పార్టీ నేతల సూచనల మేరకు చంద్రబాబు ప్రవేశ మార్గాన్ని ఆయన రుయా రోడ్డు మార్గం నుంచి ఈశాన్య గేటుకు మార్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+