TTD: శ్రీవారి దర్శనం లేకపోయినా స్వామి భక్తులకు లడ్డూలు, ఇవే రూల్స్,

ఏడుకొండలలో కొలువైన శ్రీవెంకటేశ్వర బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతోంది. దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా శ్రీవారి భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలో అన్నమయ్య భవనం వెలుపల గురువారం టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

శ్రీవారి దర్శనం టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డుతో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్‌లలో ప్రసారమవుతున్న నిరాధార ఆరోపణలు భక్తులు నమ్మవద్దని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. ఇదే సమయంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Laddu prasadas are more transparent to the devotees even if there is no darshan of Shrivari in Tirumala

ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్లలో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు లడ్డూలు తీసుకోవచ్చు అని అన్నారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి వివరించారు. కౌంటర్ నెంబర్ 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో శ్రీవారి భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చు అని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు.

అయితే శ్రీవారి దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో లాగే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చు అని వివరించారు. టోకెన్స్ లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూ తో పాటు నాలుగు నుండి ఆరు శ్రీవారి లడ్డూలను కొనుక్కోవచ్చు అని వెంకయ్య చౌదరి తెలిపారు. గతంలో కొందరు దళారులు శ్రీవారి లడ్డూలు కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించింది. దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+