జగన్ ఉన్నంత వరకు చంద్రబాబుకు ఢోకా లేదా: తెలుగు తమ్ముళ్లు హ్యాపీ

విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ నేతలకు ఓ ధైర్యం చెప్పారని అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి ఢోకా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

విజయవాడ: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ నేతలకు ఓ ధైర్యం చెప్పారని అంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి ఢోకా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఇందుకోసం ఆయన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, వైసిపి అధినేత వైయస్ జగన్‌లకు పోలిక పెట్టారని తెలుస్తోంది. రాహుల్ ఉన్నంత వరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి ఢోకా లేదని, అలాగే ఏపీలో జగన్ ఉన్నంత వరకు చంద్రబాబుకు ఢోకా లేదని సరదాగా వ్యాఖ్యానించారంటున్నారు.

లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు రాకపోయినప్పటికీ... ఆయన తన చేతలతో ఇటీవల మీడియాలో నానుతున్నారు. కొద్ది రోజుల క్రితం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లగడపాటిపై చర్చ

లగడపాటిపై చర్చ

ఆయన కలకయిపై ఎన్నో ఊహాగానాలు చెలరేగాయి. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి చెక్ పడినట్లేనని, లగడపాటి రాజగోపాల్ రాజకీయాల్లోకి తిరిగి వస్తారని, ఆయనను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపుతుందనే ప్రచారం జరిగింది.

అంతలోనే, అసలు లగడపాటి రాజకీయాల్లోకి వచ్చేందుకు కలవలేదని, టిడిపి పాలనపై చంద్రబాబుకు ఓ రిపోర్ట్ ఇచ్చారని, ఆయా ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన తన నివేదికను అందించారని ప్రచారం జరిగింది.

ఎమ్మెల్యేలను లెక్కలోకి తీసుకుంటారని..

ఎమ్మెల్యేలను లెక్కలోకి తీసుకుంటారని..

చంద్రబాబు తీరుపై ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ 2019లో ఎమ్మెల్యేల పని తీరును కూడా ప్రజలు లెక్కలోకి తీసుకుంటారని, చాలామంది ఎమ్మెల్యేల పట్ల స్థానికంగా అసంతృప్తి ఉందని లగడపాటి తన నివేదికలో వెల్లడించారని అంటున్నారు.

తెలుగు తమ్ముళ్ల గుసగుస

తెలుగు తమ్ముళ్ల గుసగుస

మరో విషయం ఏమంటే, ఆయన తన ల్యాంకో విద్యుత్ కోసం చంద్రబాబును కలిశారని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఇటీవల లగడపాటి అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత టిడిపి నేతలతో... రాహుల్ గాంధీకి, జగన్‌కు ముడిపెట్టడంపై తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట.

జగన్‌పై ఇప్పటికే..

జగన్‌పై ఇప్పటికే..

జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలోను జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను సరిగా ఉపయోగించుకోవడం లేదని కొందరు అంటున్నారు. ప్రతి దానిని రాజకీయం చేస్తున్నారని అధికార పార్టీ అంటోంది. జగన్ రాజకీయ అనుభవ లేమి టిడిపి నేతలు సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+