బాబుకు లగడపాటి షాకింగ్ రిపోర్ట్, టిడిపికి పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఓ షాకింగ్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ ఓ షాకింగ్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

చంద్రబాబుతో లగడపాటి
లగడపాటి రాజగోపాల్ ఇటీవల రెండుమూడుసార్లు చంద్రబాబు నాయుడును కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితిపై ఎప్పటికప్పుడు లగడపాటి.. చంద్రబాబుకు నివేదిక ఇస్తున్నారని భావిస్తున్నారు.

చంద్రబాబుకు లగడపాటి షాకింగ్ సర్వే రిపోర్ట్
పలువురు టిడిపి ఎమ్మెల్యేల పనితీరుపై గతంలోను చంద్రబాబుకు లగడపాటి సర్వే రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. తాజాగా మరోసారి ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 30 మంది మాత్రమే గెలుస్తారని, మిగతా వారిపై స్థానికంగా అసంతృప్తి ఉందని లగడపాటి తాజాగా చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చిందని అంటున్నారు.

ఇక ఎమ్మెల్యేలకు బాబు సూచనలు
లగడపాటి సర్వే నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు కూడా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. వారికి మరోసారి హెచ్చరికలు జారీ చేయనున్నారని తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాల్సిందిగా సూచించనున్నారు.

బాబుకు పురంధేశ్వరి కౌంటర్
ఇదిలా ఉండగా, బిజెపి నేత పురంధేశ్వరి ఇటీవల సీఎం చంద్రబాబుపై మళ్లీ నిప్పులు చెరుగుతున్నారు. ప్రాజెక్టులకు కేటాయించిన నిధులకు సంబంధించిన వివరాలు చెబితే కేంద్రం మరిన్ని నిధులు కేటాయిస్తుందని ఇటీవల ఆమె చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి వచ్చే నిధులపై టిడిపి అసంతృప్తితో ఉంది.

టిడిపి అసంతృప్తి, పురంధేశ్వరి దిమ్మతిరిగే కౌంటర్
పూర్తిస్థాయిలో నిధులు వస్తే ఏపీకి మరింత మంచిది అని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ పురంధేశ్వరు టిడిపికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు నిధులకు సంబంధించి లెక్కలు, వివరాలు చెబితే కేంద్రం మరిన్ని నిధులు ఇస్తుందని, ఏం చెప్పకుండా ఉంటే ఎలా ఇస్తారని ఆమె చెబుతున్నారు.












Click it and Unblock the Notifications