కమల్ విజ్ఞప్తి: పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న లగడపాటి

Lagadapati withdraws petition
న్యూఢిల్లీ: తన రాజీనామాను ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం ఉపసంహరించుకున్నారు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ విజ్ఞప్తితో లగడపాటి పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, తన రాజీనామాను ఆమోదించడం లేదంటూ సభాపతి మీరా కుమార్ పైన లగడపాటి రాజగోపాల్ ఢిల్లీ హైకోర్టులో పదిహేను రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాను ఆగస్టు 2వ తేదిన స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇచ్చానని, దానిని ఆమోదించలేదని ఆయన వేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తాను రాజీనామా చేసి 65 రోజులు గడుస్తున్నప్పటికీ దానిని స్పీకర్ ఆమోదించలేదని, దానిని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తన అభీష్టానికి విరుద్ధంగా తనను ఎంపీగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

స్పీకర్ రాజీనామా పైన నిర్ణయం తీసుకోకపోవడంతో తాను ఇష్టం లేకున్నా పదవిలో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని పలుమార్లు స్పీకర్‌ను కోరానన్నారు. ఇప్పుడు ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

మరోవైపు సోమవారం ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, హర్ష కుమార్‌లో మరోసారి తమ రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+