Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మా పెళ్ళికి ఆ ఇద్దరు ఒప్పుకోలేదు, తిరుపతిలో మైక్ కట్, లైట్లు ఆర్పేశారు: లక్ష్మీపార్వతి సంచలనం

హైదరాబాద్: ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకోవడానికి హరికృష్ణ, జయకృష్ణలు వ్యతిరేకించారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు. తనయులు వ్యతిరేకించినా కానీ, తనను ఎన్టీఆర్ వివాహం చేసుకొన్నారని లక్ష్మీపార్వతి చెప్పారు.

Recommended Video

    లక్ష్మీపార్వతి ఎలాంటిదో ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ! అన్నగారి ధర్మపత్ని కాదు ? | Oneindia Telugu

    ఎన్టీఆర్ తనను ఎందుకు పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందనే విషయమై లక్ష్మీపార్వతి వివరించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

    1994 ఎన్నికలకు ముందు తిరుపతిలో జరిగిన సభలో తనను వివాహం చేసుకొంటున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు కొంత తనకు ఇబ్బంది కల్గించాయన్నారు.

     ఎన్టీఆర్‌తో వివాహన్ని ఆ ఇద్దరు ఒప్పుకోలేదు

    ఎన్టీఆర్‌తో వివాహన్ని ఆ ఇద్దరు ఒప్పుకోలేదు

    ఎన్టీఆర్‌తో తనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. అయితే ఈ విషయమై తనతో చర్చించారని చెప్పారు. అయితే రహస్యంగా వివాహం చేసుకోవాలని భావించలేదని ఎన్టీఆర్ అనుకొన్నారని ఆమె చెప్పారు. అయితే ఆ సమయంలో కుటుంబసభ్యులందరికీ సమాచారం ఇచ్చారని లక్ష్మీపార్వతి చెప్పారు. కుటుంబసభ్యులదరినీ పలిచి వివాహం చేసుకోవాలనే నిర్ణయాన్ని ఎన్టీఆర్ చెప్పారని లక్ష్మీపార్వతి చెప్పారు. అయితే ఈ వివాహ ప్రతిపాదనను హరికృష్ణ, రామకృష్ణలు ఒప్పుకోలేదని చెప్పారు.

     తిరుపతిలోనే వివాహ ప్రకటన

    తిరుపతిలోనే వివాహ ప్రకటన

    1994 ఎన్నికలకు ముందు తిరుపతి సభలో ఎన్టీఆర్ తనను వివాహం చేసుకొంటానని ఎన్టీఆర్ ప్రకటించారని లక్ష్మీపార్వతి చెప్పారు. తనను వేదికపైకి పిలిచే సమయానికి లైట్లు ఆర్పేశారని, మైక్‌లు కట్ అయ్యాయని లక్ష్మీపార్వతి చెప్పారు అయితే ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో ఎన్టీఆర్ ఆ సభలో చెప్పారని ఆమె గుర్తు చేసుకొన్నారు.

     అనారోగ్యం నుండి ఆరోగ్యంగా మార్చా

    అనారోగ్యం నుండి ఆరోగ్యంగా మార్చా

    మేజర్ చంద్రకాంత్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు షుగర్ ఒకేసారి సుమారు 450కు పెరిగిందని లక్ష్మీపార్వతి చెప్పారు., పక్షవాతం కూడ వచ్చిందని లక్ష్మీపార్వతి చెప్పారు. కంటికి రెప్పలా ఎన్టీఆర్‌కు సేవ చేశానని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు.దీంతో ఎన్టీఆర్ ఆరోగ్యంగా మారాడని లక్ష్మీపార్వతి చెప్పారు.

     మీడియా ముందే వివాహం

    మీడియా ముందే వివాహం

    తిరుపతి సభ తర్వాత ఎన్టీఆర్ మీడియా సమావేశంలోనే తనకు తాళి కట్టారని లక్ష్మీపార్వతి చెప్పారు. ఆరోగ్యం బాగా లేని సమయంలో ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ తనను వెళ్ళిపోవాలని చెప్పారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు. అయితే ఆరోగ్యం బాగున్న సమయంలో దగ్గర ఉండి, ఆరోగ్యం బాగా లేని సమయంలో విడిచివెళ్ళడం సరైందికాదని తాను ఎన్టీఆర్‌కు చెప్పానని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+