జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే జరిగేదిదే..!!

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పైన లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వస్తే జరిగేదేంటో వివరించారు.

టీడీపీలోకి జూ ఎన్టీఆర్ ఎంట్రీ పైన మరోసారి చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల కోసం జనసేనతో పొత్తు..లోకేష్ పాదయాత్ర వేళ మరోసారి జూ ఎన్టీఆర్ ఎంట్రీ చర్చకు వస్తోంది. జూ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల కు దూరంగా..పూర్తిగా సినిమాల పైనే ఫోకస్ పెట్టారు. రాజకీయ వ్యవహారాల్లో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాల్లో జూ ఎన్టీఆర్ స్పందించిన తీరు టీడీపీ శ్రేణులకు నచ్చలేదు. ఆ సమయంలో కొందరు జూ ఎన్టీఆర్ పైన విమర్శలు కూడా చేసారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ తరువాత జూ ఎన్టీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ పైన మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పుడు లక్ష్మీ పార్వతి టీడీపీలోకి జూ ఎన్టీఆర్ వస్తే ఏం జరుగుతుందో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆలస్యం అయిందని అభిప్రాయపడ్డారు. జగన్ తరహాలో ప్రజల్లోనే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి అవకావం ఉండవచ్చని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. వివేక హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారుల లో టిడిపి మద్దతు దారులు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు అసమ్మతులు సాధారణమని పేర్కొన్నారు. వైసిపి ఎమ్మెల్యే గా ఉండి కోటంరెడ్డి టిడిపి తో సంభందాలు పెట్టుకున్నారని విమర్శించారు. రాజధాని రైతుల పేరుతో టిడిపి పాదయాత్ర కు కొటం రెడ్డి సాయం చేశారని ఆరోపించారు. జగన్ కు కోటంరెడ్డి ద్రోహం చేసారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.

Lakshmi Parwathi interesting comments on Jnior NTR Re Entry in TDP, is he ready for Election Campaign

నారా లోకేష్ పాదయాత్ర నవ్వులాట లా ఉందని ఎద్దేవా చేసారు. లోకేష్ రాజకీయ నాయకుడు కాలేరని.. మాట్లాడటం సరిగా తెలియని వ్యక్తి ప్రజలను ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. అన్ని పార్టీ లు గుంపు గా కలిసి వచ్చినా జగన్ ఒంటరి గా పోటీ చేస్తారని స్పష్టం చేసారు. ప్రజల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి వస్తారని లక్ష్మీ పార్వతి ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని కూడా టీడీపీలో వారసత్వం గురించి స్పందించారు. లోకేష్ పాదయాత్ర పైన విమర్శలు చేసారు. జగన్ బాబాయ్ హత్య గురించి అర్దం పర్దం లేని ఆరోపణలు చేస్తున్న లోకేష్..తన బాబాయ్ నారా రామ్మూర్తి నాయుడు ఏమయ్యారో చెప్పాలని..ఎక్కడ ఉన్నారో స్పష్టత ఇవ్వాలని కొడాలి నాని డిామండ్ చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+