నేడే అకౌంట్లలోకి డబ్బులు, మోదీ బంపర్ గిఫ్ట్! 

దేశంలో నిరుద్యోగ సమస్యకు చరమగీతం పాడుతూ, యువతకు వ్యవస్థీకృత రంగంలో ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద కొత్త కార్మికులు, యజమానులకు ఊరటనిచ్చేలా భారీ ప్రోత్సాహకాలను అందించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఢిల్లీలో జరిగే ఒక ఘనమైన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 2,400 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు నేరుగా బటన్ నొక్కి పంపిణీ చేయనున్నారు. డైరెక్ట్... బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతి ద్వారా దాదాపు 15 లక్షల మంది లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోకి ఈ సొమ్ము నేరుగా జమ కానుంది.

ఈ మహత్తర కార్యక్రమం కేవలం నిధుల పంపిణీకే పరిమితం కాకుండా, తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతతో, వారికి ఉపాధి కల్పించిన యజమానులతో ప్రధాని మోదీ స్వయంగా ముఖాముఖి మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకోనున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ పథకం వివరాలను మీడియాకు వెల్లడిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (MSMEs) బలోపేతం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

Prime Minister Modi distributing employment incentives nationwide

రూ. 99,446 కోట్ల బడ్జెట్.. 3.5 కోట్ల ఉద్యోగాలే లక్ష్యం

యువత కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఏకంగా రూ. 99,446 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. రాబోయే రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరే ప్రతి కొత్త ఉద్యోగికి గరిష్ఠంగా రూ. 15,000 వరకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. అదే సమయంలో, కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలను ప్రోత్సహించేందుకు యజమానులకు సైతం ప్రతి ఉద్యోగిపై నెలకు గరిష్ఠంగా రూ. 3,000 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. ముఖ్యంగా దేశీయంగా తయారీ రంగానికి (Manufacturing Sector) ఊతమిచ్చేలా ఈ ప్రయోజనాలను గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు పొడిగించడం విశేషం.

పూచీకత్తు లేకుండానే రుణాలు! కోవిడ్ కాలం నాటి స్కీమ్ మళ్లీ
పూచీకత్తు లేకుండానే రుణాలు! కోవిడ్ కాలం నాటి స్కీమ్ మళ్లీ

పీఎం-వీబీఆర్‌వై జాతీయ ప్రగతి చిత్రం (ఆగస్టు 2025 నుంచి):

  • కొత్త ఉద్యోగుల చేరిక: ఇప్పటివరకు దాదాపు 63 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులు వ్యవస్థీకృత శ్రామిక రంగంలో చేరారు.
  • మహిళా సాధికారత: కొత్తగా చేరిన వారిలో సుమారు 30 శాతం మంది మహిళలు ఉండటం విశేషం.
  • చిన్న సంస్థలకు ఊతం: ఈ పథకంలో ప్రోత్సాహకాలు పొందుతున్న సంస్థలలో 80 శాతానికి పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులతో నడిచే చిన్న తరహా సంస్థలే కావడం గమనార్హం.
  • కార్మిక బలగంలో యువత హవా: ఈపీఎఫ్‌ఓ గణాంకాలు

దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్మిక బలగంలోకి వచ్చిన వారిలో సగానికి సగం (50 శాతం) మంది 18-25 ఏళ్ల లోపు వయసున్న యువతీ యువకులే కావడం విశేషం. గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో 1.16 కోట్ల మంది కొత్తగా కేంద్ర భవిష్య నిధి సంస్థ (EPFO) సామాజిక భద్రత పరిధిలోకి వచ్చారు. వీరిలో 30 లక్షల మంది కేవలం 18-21 ఏళ్ల వయసు లోపు వారేనని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. పీఎం-వీబీఆర్‌వై పథకం తెచ్చిన ఉత్సాహం , ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే ఇంత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 PM Garib Kalyan Yojana: 12 ఏళ్ల ప్రస్థానం.. మోదీ ఎమోషనల్ పోస్ట్!
PM Garib Kalyan Yojana: 12 ఏళ్ల ప్రస్థానం.. మోదీ ఎమోషనల్ పోస్ట్!

తెలంగాణ యువతకు రూ. 30 కోట్ల లబ్ధి.. సంస్థలకు పండుగ

ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని యువత , పారిశ్రామిక వర్గాలకు భారీగా లబ్ధి చేకూరనుంది. తెలంగాణ జోన్ పరిధిలో తొలిసారిగా ఉద్యోగులుగా మారిన 57,544 మంది యువతకు ఒక నెల ఈపీఎఫ్ వేతనంగా (గరిష్ఠంగా రూ. 15 వేలు) వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 30.72 కోట్లు ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. అలాగే, తమ సంస్థల్లో అదనపు ఉద్యోగాలను సృష్టించినందుకు గాను తెలంగాణలోని 3,674 సంస్థల యాజమాన్యాలకు రెండు సంవత్సరాల పాటు ఇచ్చే ప్రోత్సాహకాల్లో భాగంగా ఈరోజు రూ. 105.60 కోట్లు అందనున్నాయి.

దేశవ్యాప్తంగా వర్చువల్ పద్ధతిలో మహా సంబరం

ఢిల్లీలో జరిగే ఈ ప్రధాన కార్యక్రమంతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 200 పారిశ్రామిక క్లస్టర్ల నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు వర్చువల్ పద్ధతిలో భాగస్వాములు కానున్నారు. స్థానిక స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు, మేయర్లు, శాసనసభ్యుల సమక్షంలో ఈ ఉపాధి సంబరాలను ఏకకాలంలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పథకం ద్వారా అటు శ్రామిక శక్తికి భద్రత, ఇటు పరిశ్రమలకు ఆర్థిక చేయూత లభిస్తూ దేశ ప్రగతి మరింత పరుగులు పెట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+