లగడపాటి 'ల్యాంకో' కుదేలు: బ్యాంకుల చేతికి మరో తెలుగు కంపెనీ..!
విజయవాడ: నిర్మాణ రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న తెలుగు వారికి చెందిన కంపెనీ ఐవీఆర్‌సీఎల్ తదనంతర జరిగిన పరిణామాల్లో బ్యాంకుల చేతికి వెళ్లిపోయింది. రోజు రోజుకీ పెరుగుతున్న రుణ భారంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన కంపెనీని రుణాలిచ్చిన బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి.
అంతేకాదు కంపెనీలో ప్రమోటర్లకు చెందిన వాటాలను దక్కించుకున్న బ్యాంకులు ఐవీఆర్‌సీఎల్ కంపెనీలో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నాయి. ఇప్పుడు మళ్లీ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలోని 'ల్యాంకో ఇన్ ఫ్రా'కు ఎదురు కానుంది.
పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ల్యాంకో ఇన్‌ఫ్రాలో బ్యాంకులు మెజారిటీ వాటా తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ముమ్మరం చేశాయి. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సారధ్యంలో బ్యాంకుల కన్సార్టియం ల్యాంకో ఇన్‌ఫ్రాకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చింది.

బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న ల్యాంకో ఆ తర్వాత రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. ఇందులో భాగంగా కంపెనీలకిచ్చిన రుణాలు సత్వరం వసూలయ్యే అవకాశాలు కనిపించకపోతే రుణాలను వాటాలుగా మార్చుకుంటూ వ్యూహాత్మక పునర్‌వ్యవస్థీకరణకు దిగుతున్నాయి.
తాజా అంచనాల ప్రకారం ల్యాంకో గ్రూప్ రుణ భారం రూ.39,980 కోట్ల మేర ఉండటంతో ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని తొమ్మిది బ్యాంకులు (ఎస్‌డీఆర్) దీన్ని వాటాగా మార్చుకునే ప్రయత్నాలు ఆరంభించాయి. విజయ్ మాల్యా వ్యవహారం నేపథ్యంలో సుప్రీంకోర్టు బ్యాంకులపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఇందులో భాగంగా ల్యాంకో గ్రూపులోని విద్యుత్ వ్యాపారాన్ని విడగొట్టేందుకు కార్యచరణను రూపొందించింది. ఇందులోని లగడపాటి కుటుంబానికి ఉన్న మెజారిటీ వాటాలను చేజిక్కించుకుని, సదరు కంపెనీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి తాను రూపొందించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఆ బ్యాంకు... ల్యాంకో ప్రతినిధులకు వివరించింది.
మార్కెట్‌లో జరుగుతున్న ఈ ప్రచారంపై ల్యాంకో స్పందించింది. బ్యాంకులు తమ ముందు ఈ ప్రతిపాదనను పెట్టాయని ల్యాంకో కూడా ధ్రువీకరించింది. సుమారు 8,000 మెగావాట్ల పైచిలుకు ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న విద్యుత్ విభాగానికి సంబంధించి హోల్డింగ్ స్థాయిలో గానీ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ స్థాయిలో గానీ వ్యూహాత్మక ఇన్వెస్టరును తీసుకొచ్చే దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయని ఆ సంస్థ పేర్కొంది.
అప్పుల ఊబిలో ఉన్న ల్యాంకో ఇన్‌ఫ్రాకు చెందిన రూ.7,000 కోట్ల రుణాలను పునర్ వ్యవస్థీకరించడంపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. అలా చేసినా, ఆస్తులు సైతం విక్రయించినా రుణ భారం తగ్గకపోవటంతో ఎస్‌డీఆర్‌కు తెరలేపాయి. ప్రస్తుతం ల్యాంకో గ్రూప్‌లో 50కి పైగా అనుబంధ సంస్థలున్నాయి. వీటిలో ప్రమోటర్లకు 70.55 శాతం వాటాలుండగా, సంస్థాగత, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు 29 శాతం మేర వాటాలున్నాయి.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications