కుంగుతున్న భూమి: ఊరు ఊరే ఖాళీ, గత రెండు రోజులుగా భయాందోళనలు
కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప శివారు ప్రాంతాల్లోని భూమి కుంగిపోతోంది. బుగ్గ అగ్రహారా, నాకిరెడ్డిపల్లి, బుగ్గవంక గ్రామాల్లో భూమి కుంగిపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఇదే జరుగుతోంది. నాయినోరిపల్లి గ్రామాన్ని ఖాళీ చేయించి ప్రజలను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు.
బుగ్గ8వంక ప్రాజెక్టు పూర్తిగా నీటితో నిండింది. దాంతో కిందికి నీటిని విడుదల చేశారు. ఈ స్థితిలో దిగువన ఉన్న గ్రామాల్లో భూమి 15 నుంచి 20 అడుగుల లోతు మేరకు కుంగిపోయింది. పలు చోట్ల 40 అడుగుల లోతు వరకు గుంతలు పడ్డాయి. భూమి లోపలి పొరల్లో జరుగుతున్న మార్పుల వల్లనే ఇలా జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నీటి ఊటలు పడుతున్నాయి.

ఇలాంటి స్థితిలోనే వాటర్‌ట్యాంకు భూమిలోకి కుంగింది. దీంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులకు ఆ మరుసటి రోజే మరికొన్ని చోట్ల కుంగినభూమి భయాందోళనకు గురి చేసింది. ఇలా భూమి కుంగి గుంతలు పడుతుండడంతో కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం నాయనోరిపల్లెలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పక్కనే వాటర్‌ట్యాంకు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం మధ్యాహ్నం గ్రామంలో అధికారులు పర్యటించారు. ముందు జాగ్రత్తగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేచర్యలు చేపట్టారు. అధికవర్షాలు కురవడం వల్లే ఇలా గుంతలు పడివుంటాయని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications