ఉత్కంఠ: టి బిల్లుకు భాషా సమస్య, చర్చిస్తున్న కిరణ్
హైదరాబాద్: తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో ఉత్కంఠ కొనసాగుతుండగా ఇప్పుడు కొత్త సమస్య నచ్చినట్లుగా కనిపిస్తోంది. బిల్లు నిబంధనల ప్రకారం తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఉండాలి. అయితే ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణ బిల్లు ప్రతులు కేవలం ఆంగ్ల భాషలో మాత్రమే ఉన్నాయి.
ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేశారు. తెలంగాణ బిల్లు విషయంలో భాషా సమస్య వచ్చిందని సిఎస్ ముఖ్యమంత్రికి తెలిపారు. దీంతో కిరణ్ తీసుకోవాల్సిన తదుపరి చర్యల పైన సమాలోచనలు జరుపుతున్నారు.

మరోవైపు అసెంబ్లీకి తెలంగాణ బిల్లును పంపకపోవడంపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఇంకోవైపు మజ్లిస్ ఎమ్మెల్యేలతో తెరాస, సిపిఐ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని ఎంఐఎం ఎమ్మెల్యేలకు వినతి చేశారు.












Click it and Unblock the Notifications