బోనీకపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకుందంటే: పెళ్లిలో.. శ్రీదేవి చివరి క్షణాలు (ఫోటోలు)

హైదరాబాద్: సినీ నటి శ్రీదేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీదేవి మృతి చెందిన విషయం ఎవరు జీర్ణించుకోవడం లేదు.

Recommended Video

    శ్రీదేవి : వివాహితుడిని పెళ్లి చేసుకోను..!

    నటి శ్రీదేవి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని, బాల నటిగానే ఆమె ఎన్నో చిత్రాలు నటించారని, ఆమె లేని లోటు తీర్చలేనిది అని ఎంపీ, టీడీపీ నేత, నటుడు మురళీ మోహన్ అన్నారు. శ్రీదేవి మృతితో టాలీవుడ్ శోకసముద్రంలో మునిగింది.

    వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదంటారు

    వ్యక్తిగత జీవితం సాఫీగా సాగలేదంటారు

    శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్‌గా అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం అంతసాఫీగా సాగలేదనే చెబుతుంటారు. సినీ అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో ఆమె నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది. దీనిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

    బోనీకపూర్ మొదటి భార్య ఏమన్నారంటే

    బోనీకపూర్ మొదటి భార్య ఏమన్నారంటే

    అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    అంతకుముందే సంబంధం

    అంతకుముందే సంబంధం

    వివాహానికి ముందే బోనీ కపూర్‌కు శ్రీదేవితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. బోనీకపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని, అందుకే బోనీకపూర్... శ్రీదేవిని వివాహం చేసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బోనీ‌కపూర్‌ను పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.

    శ్రీదేవి చివరిసారి చిత్రాలు

    శ్రీదేవి చివరిసారి చిత్రాలు

    ఇదిలా ఉండగా, నటి శ్రీదేవి మృతి నేపథ్యంలో చివరిసారి ఆమె పెళ్లి వేడుకలో పాల్గొన్న చిత్రాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కుటుంబీకులతో, అలాగే పెళ్లి మండపంలో ఉన్న ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

    శ్రీదేవి నాలుగు సినిమాల్లో పాటలు కూడా పాడారు

    శ్రీదేవి నాలుగు సినిమాల్లో పాటలు కూడా పాడారు

    తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు. నాలుగు సినిమాల్లో పాటలు కూడా పాడారు. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది.

    అంగ్ల ఛానల్ జాతీయ అవార్డు

    అంగ్ల ఛానల్ జాతీయ అవార్డు

    శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్‌ కాగా, నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్‌ జ్యూరీ లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన క్షణక్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్‌ సీఎన్‌ఎన్‌-ఐబీఎన్‌ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియాస్‌ గ్రేటెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ 100 ఇయర్స్‌గా శ్రీదేవి ఎంపికయ్యారు.

    పెళ్లి తర్వాత గుడ్‌బై, మళ్లీ

    పెళ్లి తర్వాత గుడ్‌బై, మళ్లీ

    పెళ్లి తర్వాత శ్రీదేవి సినిమా కెరీర్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే 2004-05 మధ్యకాలంలో మాలినీ అయ్యర్‌గా బుల్లితెర మీద కొద్దికాలం ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి నటించడం వల్లే మాలినీ అయ్యర్‌ పాత్ర బాగా పాపులరయింది. ఆ సీరియల్‌ అయిపోయాక రెండు మూడుసార్లు టీవీ షోలకు హాజరుకావడం తప్ప నటిగా మళ్లీ తెర మీదకు రాలేదు.

    కూతురును పరిచయం చేస్తున్న శ్రీదేవి

    కూతురును పరిచయం చేస్తున్న శ్రీదేవి

    నిర్మాతగా పోకిరి చిత్రాన్ని హిందీలో సల్మాన్‌తో వాంటెడ్‌గా నిర్మించారు శ్రీదేవి. 2012లో వచ్చిన ఇంగ్లీష్‌-వింగ్లీష్ చిత్రం ద్వారా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవలే మామ్ చిత్రంతో మరోసారి అలరించారు. ప్రస్తుతం ఆమె పెద్ద కుమార్తె జాన్వీని వెండితెరకు పరిచయం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరాఠాలో ఘన విజయం సాధించిన సైరాట్ సినిమాను హిందీలో దడాక్ పేరుతో రిమేక్‌ చేస్తున్నారు. కరణ్‌ జోహర్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+