జగన్ Vs చంద్రబాబు, గెలుపెవరిది : ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు - లేటెస్ట్ సర్వే..!!
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్దుల ఖరారు పైన కసరత్తు వేగవంతం చేసాయి. జగన్ వై నాట్ 175 నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను.. ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. అటు జగన్ ను ఓడించటమే టార్గెట్ గా టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగాయి. ఈ సమయంలోనే తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఆసక్తికర అంచనాలు వెల్లడించింది. ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో విశ్లేషించింది. అధికారం ఎవరిదో అంచనా వేసింది.
తాజా సర్వే అంచనాలు :ఒక ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో ఓటర్ల మూడ్ పైన సర్వే చేసింది. అధికారం ఎవరికి దక్కే అవకాశం ఉందనేది విశ్లేషించింది. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన 2.50 లక్షల శాంపిల్స్ తో పాటుగా పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా వాటి పరిధిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది. నియోజకవర్గా వారీగా వివరాలు వెల్లడించింది. ఈ సంస్థ అంచనాల మేరకు ఏపీలో వైసీపీకి 50.10 ఓటింగ్ శాతం దక్కనుంది. అదే విధంగా టీడీపీ, జనసేన కూటమికి 43.12 శాతం ఓట్లు దక్కనున్నాయి. ఇంకా నిర్ణయించుకోని వారు 4.70 శాతంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. హోరా హోరీ పోరులో వీరి నిర్ణయమే కీలకం అయ్యే ఛాన్స్ ఉంది. దీని ద్వారా వైసీపీ 113 స్థానాల్లో..టీడీపీ, జనసేన 46 స్థానాలు గెలుచుకుంటాయని అంచనా వేసింది. మరో 16 స్థానాల్లో హోరా హోరీ పోరు తప్పదని తేల్చింది.

ఎవరికెన్ని సీట్లు : లోక్ సభ స్థానాల వారీగా వాటి పరిధిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది అంచనాగా వెల్లడించింది. వైసీపీ వర్సస్ టీడీపీ, జనసేన కూటమిగా ఫలితాలు విశ్లేషించింది. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో వైసీపీ 4, టడీపీ జనసేన 3 స్థానాలు గెలవనున్నాయి. విజయనగరం లోక్ సభ పరిధిలో వైసీపీ 4, టీడీపీజనసేన 1, ఎచ్చర్ల, నెల్లమర్లలో టఫ్ ఫైట్ ఉండనుంది. అరకులో వైసీపీ ఆరు, టీడీపీ జనసేన ఒక స్థానం గెలుస్తాయని అంచనా వేసింది. విశాఖ పార్లమెంట్ పరిధిలో వైసీపీ 4, టీడీపీ జనసేన 2, విశాఖ నార్త్ లో టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చింది. అనకాపల్లిలో వైసీపీ 4 టీడీపీ 2, అనకాపల్లిలో హోరా హోరీ పోరు తప్పదని అంచనా వేసింది. ఇక..రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో వైసీపీ 3, టీడీపీ జనసేన నాలుగు స్థానాలు గెలవనున్నాయి, కాకినాడ పరిధిలో వైసీపీ 4, టీడీపీ జనసేన 2, కాకినాడ సిటీ టైట్ ఉంటుందని తేల్చింది.

పార్లమెంట్ పరిధిలో : అమలాపురం లో వైసీపీ 5, టీడీపీ జనసేన 1, మండపేట టఫ్ పోటీ ఉంటుందని అంచనా వేసింది. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో మాత్రం వైసీపీ కంటే టీడీపీ, జనసేన మెజార్టీ సీట్లు సాధిస్తాయని తేల్చింది. నర్సాపురం లో వైసీపీ 1, టీడీజీ జనసేన 5, ఆచంట లో హోరా హోరీ ఉండనుందని విశ్లేషించింది. ఏలూరు లో వైసీపీ 5, టీడీపీ జనసేన 2, మచిలీపట్నం లోవైసీపీ 4, టీడీపీ జనసేన 3, విజయవాడ పరిధిలో వైసీపీ 4, టీడీపీ జనసేన 2, జగ్గయ్య పేట టఫ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. గుంటూరు పరిధిలో వైసీపీ 3, టీడీపీ జనసేన 3, తాడికొండ టఫ్ ఉండనుంది. నర్సరావుపేట లో వైసీపీ ఆరు, టీడీపీ జనసేన 1 (చిలకలూరిపేట) గట్టి పోటీ ఉండనుంది. బాపట్ల పరిధిలో వైసీపీ 3, టీడీపీ జనసేన 3, రేపల్లె టఫ్ ఫైట్ కొనసాగనుంది. ఒంగోలు పరిధిలో వైసీపీ 4, టీడీపీ జనసేన 3 గెలుస్తాయని తేల్చింది.

అక్కడే వైసీపీదే ఆధిక్యం : అదే విధంగా నెల్లూరు పరిధిలో వైసీపీ 5, టీడీపీ జనసేన 1, ఉదయగిరి టైట్ ఉంటుందని వెల్లడించింది. కర్నూలు పరిధిలో వైసీపీ 6, టీడీపీ జనసేన 1, నంద్యాల పరిధిలో 6 వైసీపీ, బనగానపల్లి టైట్ ఉండనుంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైసీపీ 4 , టీడీపీ1 , శ్రీకాళహస్తి టైట్ ఫైట్ తప్పదని అంచనా వేసింది. చిత్తూరులో వైసీపీ 4, టీడీపీ 1, చిత్తూరు, పూతలపట్టులో టఫ్ ఫైట్ ఉండనుంది. అనంతపురంలో వైసీపీ 4, టీడీపీ 2, తాడిపత్రి హోరా హోరీ పోరు ఉందని తేల్చింది. హిందూపూర్ లోక్ సభ పరిధిలో వైసీపీ 5, టీడీపీ 2 స్థానాలు గెలవనున్నాయి. రాజంపేట పరిధిలో ఏడు స్థానాలు వైసీపీ కైవసం చేసుకోనుంది. అదే విధంగా కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీ 7 స్థానాలను గెలుచుకుంటుందని ఈ సంస్థ తేల్చింది. కాగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 28 మంది పైన వ్యతిరేకత ఉందని విశ్లేషించింది.












Click it and Unblock the Notifications