మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ పవర్‌కు బ్రేక్ వేసిన మెగా హీరోయిన్ భర్త
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా... మహాయుతి కూటమి 222 స్థానాల్లో ముందంజలో ఉంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మిగిలిన స్థానాల్లో ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది.మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం.
ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజార్టీ సీట్లలో ముందంజలో ఉండటంతో ఆ కూటమి గెలుపు ఖాయం అయిపోయింది. ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం బీజేపీ కూటమి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. అయితే ఒక్క నియోజకవర్గంలో మాత్రం పవన్ కల్యాణ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు.

మహారాష్ట్ర లాతూర్ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కూటమి అభ్యర్థి తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రమేష్ కాశీరామ్ కరాద్ ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ధీరాజ్ విలాస్‌రావు దేశ్‌ముఖ్ పోటీ చేశారు. బాలీవుడ్ నటుడు, హీరోయిన్ జెనిలీయా భర్త రితేష్ దేశ్‌ముఖ్‌కు ధీరాజ్ విలాస్‌రావు దేశ్‌ముఖ్ స్వయానా అన్నయ్య అవుతారు దీంతో అన్న .ధీరాజ్ విలాస్‌రావు దేశ్‌ముఖ్ తరుఫున నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం లాతూర్ నియోజకవర్గంలో ధీరాజ్ విలాస్‌రావు దేశ్‌ముఖ్ లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇంకా లెక్కించాల్సిన రౌండ్లు ఉండటంతో గెలుపుపై బీజేపీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications