మద్యం మత్తులో లా విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో లా విద్యార్థిని పైన అత్యాచారం జరిగింది. తోటి విద్యార్థి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. సెకండియర్ విద్యార్థిని పైన నాలుగో సంవత్సరం విద్యార్థి అఘాయిత్యం చేశాడు.
దీని పైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత రాత్రి వారు పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో మద్యం మత్తులో అతను ఘాతుకానికి పాల్పడ్డారు. అమ్మాయిని మెడికల్ పరీక్షల కోసం పంపించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాలేజీకి పంపించలేదని విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం జిల్లాలోని మేళాపురంలో కాలేజీకి పంపించలేదనే మనస్థాపంతో ఓ విద్యార్థిని ఒంటి పైన కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. ఈ సంఘటనతో విద్యార్థిని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఒకే ఇంట్లో ఐదుగురికి పాముకాటు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మంగళవారం రాత్రి పాము కాటువేసింది. నాగరాజు ఇంట్లోకి చొరబడిన కట్లపాము నిద్రిస్తున్న అతని సోదరి సంజమ్మ, పిల్లలు దిలీప్, సంతోష్, బంధువుల పిల్లలు నవీన్, హర్షవర్ధన్‌ను కాటు వేసింది.
తెల్లవారుజామున పాము కాటుకు గురైన సంజమ్మ మెలకువ వచ్చి లేచి చూడగా పాము కనిపించింది. వెంటనే విషయాన్ని నాగరాజుకు చెప్పడంతో ఐదుగురిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. వీరంతా కోలుకుంటున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications