హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టేషన్‌లో ఫిర్యాదు: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ ఆడియో ఫంక్షన్‌లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారా? అంటే అవుననే అంటున్నారు. మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా సోమవారం మండిపడ్డారు.

బరితెగించిన బంగారు బుల్లోడు: బాలయ్యను టార్గెట్ చేసిన సాక్షి డైలీ సోమవారం రోజా మీడియాతో మాట్లాడుతూ మహిళల పైన బాలకృష్ణ అలా మాట్లాడటం సరికాదన్నారు. కళాకారుడైన బాలకృష్ణ తన నాలుకను స్లిప్ అయ్యారన్నారు. మహిళలను ఆడపడుచులుగా గౌరవించే స్వర్గీయ ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అని.. అలాంటి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదన్నారు.

Lawyers filed complaint against nandamuri balakrishna

బాలకృష్ణ తెలియక నోరు జారి ఉంటే ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. బాలకృష్ణ అలా మాట్లాడి ఉంటారని తాము ఎప్పుడూ ఊహించలేదన్నారు. పొరపాటున టంగ్ స్లిప్ అయి ఉంటే తప్పకుండా క్షమాపణ చెప్పాలన్నారు. అంతేకాదు ఆయన క్షమాపణ చెబుతారని భావిస్తున్నామన్నారు.

అమ్మాయికి ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలి: బాలయ్య షాకింగ్ కామెంట్స్!

మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల న్యాయవాద జేఏసీ మండిపడింది. మహిళల పట్ల బాలకృష్ణ చేసి వ్యాఖ్యలకు గాను సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ అనే లాయర్ బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే స్థాయిలో ఉండి.. ప్రజాప్రతినిధిగా మహళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మహిళలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కానివని అన్నారు. మహిళలకు బహిరంగంగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని రవికుమార్ డిమాండ్ చేశారు.

కాగా.. నారా రోహిత్ హీరోగా నటించిన సావిత్రి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా బాలకృష్ణ ప్రసంగంలో అసభ్య వ్యాఖ్యలు చేశారు. ''అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పకోరు కదా. ముద్దైనా పెట్టాలి... లేదా కడుపైనా చేయాలి. అంతే.. కమిట్ అయిపోవాలి..'' అని వ్యాఖ్యానించారు.

English summary
Lawyers filed complaint against nandamuri balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X