హీరోగా బాలకృష్ణ, లోకేష్ వ్యాఖ్యలు: బాబు సహిస్తారా.. ఆ చిత్రంపై లక్ష్మీపార్వతి డౌట్స్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లోను అలజడి సృష్టిస్తోంది. వర్మ అంటేనే వివాదం.

అమరావతి/హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ తీస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లోను అలజడి సృష్టిస్తోంది. వర్మ అంటేనే వివాదం.

చదవండి: ఎన్టీఆర్ బయోపిక్‌పై వర్మకు నారా లోకేష్ షాక్: బీర్ వ్యాఖ్యలపై కామెంట్స్

అలాంటిది ఎన్టీఆర్ సినిమా అంటే అది వివాదాస్పదం అవుతుందని చాలామంది భావిస్తున్నారు. వర్మ చేతిలో ఎన్టీఆర్ బయోపిక్ అంటే అది సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోసాని మురళీ కృష్ణ నుంచి లక్ష్మీపార్వతి వరకు అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు.

చదవండి: చెప్పుతో కొడతారు: వర్మకు పోసాని హెచ్చరిక, లక్ష్మీపార్వతి 'బాలకృష్ణ' వ్యాఖ్యపై నో

వర్మ చేతిలో పడకపోవడమే..

వర్మ చేతిలో పడకపోవడమే..

వర్మ.. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే ఆయన ఎవరిని విలన్‌గా చూపిస్తారు, ఎన్టీఆర్ జీవితంలోని సున్నిత అంశాలను ఎలా తెరకెక్కిస్తారనే చర్చ సాగుతోంది. గతంలో రక్త చరిత్ర, వంగవీటి సినిమాలు తీశారు. కానీ పూర్తిగా స్టడీ చేయకుండానే తీశారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలు దైవంగా కొలిచే ఎన్టీఆర్ బయోపిక్ అంటే మామూలు విషయం కాదు. అలాంటి సినిమా వర్మ చేతిలో పడకపోవడమే బెట్టర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అక్కడే లక్ష్మీపార్వతికి అనుమానం

అక్కడే లక్ష్మీపార్వతికి అనుమానం

ఎన్టీఆర్ బయోపిక్ తీస్తేవర్మ నిజాలు చూపించగలరని తాను భావిస్తున్నానని, కానీ హీరోగా బాలకృష్ణ పేరును ప్రకటించడం వల్ల తనకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని లక్ష్మీపార్వతి అంటున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్‌లో నేరుగా చంద్రబాబుతో పాటు బాలకృ,్ణ కూడా భాగస్వామిగా ఉన్నారని, అలాంటప్పుడు ఆయన హీరోగా నటిస్తే నిజాలు చూపించడం ఎలా సాధ్యమవుతుందనేది ఆమె అనుమానం.

బాలకృష్ణ అలా చూపిస్తే చంద్రబాబు సహిస్తారా?

బాలకృష్ణ అలా చూపిస్తే చంద్రబాబు సహిస్తారా?

చంద్రబాబు వెన్నుపోటు, వైస్రాయ్ సంఘటనతో పాటు చనిపోవడానికి ముందు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చెప్పిన అంశాలను కూడా సినిమాలో చూపించాలని లక్ష్మీపార్వతి చెప్పారు. ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు రోజు ఆయనకు ఎదురైన అనుభవాలను సినిమాలో చూపించాలన్నారు. రక్త చరిత్ర సినిమాలో ఎన్టీఆర్‌ను హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తిగా చూపించిన వర్మ.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగుడుతుంటే అనుమానంగా ఉందని అంటున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచే సమయంలో బాలకృ,్ణ కూడా సహకరించారని చూపించాలన్నారు. బాలకృష్ణ హీరోగా ఉంటే, వెన్నుపోటు ఉదంతాన్ని చూపిస్తే బాలకృష్ణను చంద్రబాబు సహిస్తారా అని లక్ష్మీపార్వతి నిలదీశారు.

జెమిని టీవి ధర్మపీఠంలో చెప్పినవి...

జెమిని టీవి ధర్మపీఠంలో చెప్పినవి...

ఎన్టీఆర్ చివరి రోజుల్లో చంద్రబాబును ఉద్దేశించి జెమిని టీవి ధర్మపీఠంలో ఎన్టీఆర్ చెప్పిన అంశాలను పరిగణలోకితీసుకోవాలని లక్ష్మీపార్వతి అన్నారు. జామాత దశమగ్రహం పేరుతో ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియోను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. బాలయ్య కంటే కమల్ హాసన్‌ను హీరోగా పెడితే బాగుంటుందన్నారు. సినిమా తీసే ముందు తొలుత భార్యగా తన అనుమతి తీసుకోవాలన్నారు.

పోసాని మురళీ కృష్ణ కూడా..

పోసాని మురళీ కృష్ణ కూడా..

ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని మురళీకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీయకపోవడమే మంచిదని రామ్ గోపాల్ వర్మకు హితవు పలికారు. తాను రిక్వెస్ట్ మాత్రమే చేయగలనని, కానీ సినిమా తీయవద్దని తాను ఆదేశించలేనని చెప్పారు. కానీ ఎన్టీఆర్ వంటి వ్యక్తిని అవమానించేలా సినిమా తీస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోసాని హెచ్చరించారు.

టిడిపిలోను అనుమానాలున్నాయా?

టిడిపిలోను అనుమానాలున్నాయా?

ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని వర్మ చెప్పారు. ఇది టిడిపిలోను చర్చకు దారి తీసింది. వైస్రాయ్ ఇష్యూ అందులో ఉంటుందా అనే చర్చ సాగుతోంది. అయితే లోకేష్ వ్యాఖ్యలు, బాలకృష్ణ హీరోగా అని చెప్పడం చూస్తుంటే వైస్రాయ్ ఎపిసోడ్ ఉండకపోవచ్చునని లేదా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో బాలకృష్ణ హీరో అయితే వైస్రాయ్ ఘటనను ఏం చేస్తారనేది ప్రశ్నార్థకమే అంటున్నారు. పైగా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఎన్టీఆర్ బయోపిక్ పైన మామయ్య బాలకృష్ణనే నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయానికి తమ సహకారం ఉంటుందన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు వర్మనా కాదా అనేది నిర్ణయించలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+