Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేదురుమల్లికి జగన్, చిరు, నేతల నివాళులు (పిక్చర్స్)

హైదరాబాద్: అనార్యోగంతో మృత్యు ఓడికి చేరిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయానికి పలువురు రాజకీయ నేతలు శుక్రవారం నివాళులు అర్పించారు. హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో శుక్రవారం ఉదయం కన్నుమూసిన ఆయన భౌతిక కాయాన్ని సందర్శకుల దర్శనార్థం ఎపిసిసి కార్యాలయం ఇందిరా భవన్‌కు తరలించారు.

ఇందిరాభవన్‌లో ఆయన భౌతిక కాయాన్ని అభిమానులు, రాజకీయ నేతలు సందర్శించారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. నేదురుమల్లి భౌతిక కాయాన్ని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం సాయంత్రం 5.30 నుంచి 6.15 గంటల వరకూ నాంపల్లిలోని ఇందిరా భవన్‌లో ఉంచారు.

అనంతరం రోడ్డు మార్గం గుండా నేదురుమల్లి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా వాకాడుకు భౌతిక కాయాన్ని తరలించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయనకు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.

జయప్రకాష్ నారాయణ ఇలా..

జయప్రకాష్ నారాయణ ఇలా..

లోకసత్తా జాతీయ నేత జయప్రకాష్ నారాయణ నేదరుమల్లి జనార్దన్ రెడ్డి బౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వచ్చారు.

నామా నాగేశ్వర రావు ఇలా..

నామా నాగేశ్వర రావు ఇలా..

తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించాడనికి శుక్రవారం వచ్చారు.

లగడపాటి రాజగోపాల్ ఇలా..

లగడపాటి రాజగోపాల్ ఇలా..

మాజీ పార్లమెంటు సభ్యుడదు లగడపాటి రాజగోపాల్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి నివాళులు అర్పించడానికి ఇలా వచ్చారు.

డిజిపి ప్రసాదరావు ఇలా..

డిజిపి ప్రసాదరావు ఇలా..

డిజిపి ప్రసాదరావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణను కూడా చూడవచ్చు.

ఆనం రామనారాయణ రెడ్డి ఇలా..

ఆనం రామనారాయణ రెడ్డి ఇలా..

మాజీ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

రఘువీరా రెడ్డి నివాళులు

రఘువీరా రెడ్డి నివాళులు

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి నివాళులు అర్పించారు.

నేదురుమల్లి రాజ్యలక్షి ఇలా..

నేదురుమల్లి రాజ్యలక్షి ఇలా..

భర్త నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరణంతో ఆయన భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఇలా విషాదంలో మునిగిపోయారు. ఆమె కూడా రాష్ట్ర మంత్రిగా కొంత కాలం పనిచేశారు.

సంతోష్ రెడ్డి ఇలా..

సంతోష్ రెడ్డి ఇలా..

తెలంగాణకు చెందిన మాజీ మంత్రి సంతోష్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

జగన్ నివాళి

జగన్ నివాళి

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సందర్శించి నివాళులు అర్పించారు.

సి. రామచంద్రయ్య నివాళి

సి. రామచంద్రయ్య నివాళి

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి మాజీ మంత్రి సి. రామచంద్రయ్య, తెలుగుదేశం నాయకులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులు నివాళులు అర్పించారు.

చిరంజీవి నివాళి

చిరంజీవి నివాళి

కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

గల్లా అరుణ కుమారి

గల్లా అరుణ కుమారి

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+