లెఫ్ట్‌పార్టీల రైట్: పవన్ అందగాడే కానీ.. నారాయణ డౌట్
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవాలని సిపిఎం, సిపిఐ పార్టీలు నిర్ణయించాయి. పొత్తుల విషయమై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, పార్టీల ఇతర నాయకులు భేటీ అయ్యారు. పొత్తులపై చర్చించారు. అనంతరం నారాయణ, రాఘవులు విలేకరులలో మాట్లాడారు.
మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని చెప్పారు. సీట్ల సర్దుబాటు కోసం మరో దఫా చర్చించనున్నారు. కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీయేతర పార్టీలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాదులో మగ్థూం భవన్‌లో చర్చించారు. బిజెపిలాంటి మతతత్వ పార్టీని దూరంగా పెడుతామన్నారు.

కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెట్టడాన్ని వామపక్షాలు స్వాగతించాయి. ఈ సందర్భంగా నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నటుడు పవన్ కల్యాణ్ అందంగా ఉంటాడు అంతే తప్ప ఇంకేమీ తెలియదన్నారు. ఆయన అందగా ఉంటాడని తెలుసునని, ఓట్లు రాబడుతారో లేదో తెలియదన్నారు. మిగతా అంశాలపై తాము పార్టీ పెట్టాక ఆలోచిస్తామన్నారు.
తాజా నిర్ణయంతో వామపక్షాలు చాలాకాలం తరువాత ఎన్నికల బరిలో నిల్చుంటున్నాయి. గతంలో కాంగ్రెస్‌తో ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీతో ఒక పార్టీ జత కలిసి ఎన్నికల బరిలో దిగాయి.
పార్టీ విధానాలు త్వరలో: కిరణ్
జై సమైక్యాంధ్ర పార్టీ విధివిధానాలను తాను త్వరలో ప్రకటిస్తానని ఆ పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల నాడి బట్టే అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications