సీఎం చంద్రబాబు స్వగ్రామంలో చిరుత కలకలం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామంలో చిరుత పులి సంచరించడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో చిరుత పులి సంచారాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నెమళ్ల వేట కోసమే చిరుత తరచుగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా అటవీశాఖ అధికారులు చిరుతను తరిమికొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామం వైపు చిరుత పులి రాకుండా బాణాసంచా పేల్చి శబ్దాలు చేస్తున్నారు.
అలానే అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సప్పర్ల రెయిన్‌గేజ్ వద్ద చిరుత జాడలు కలకలం సృష్టించాయి. సీలేరు రేంజ్ అటవీశాఖాధికారి వెంకటరావు ఆదేశాలతో డిప్యూటీ రేంజ్ అధికారి సతీశ్ నేతృత్వంలో అటవీ సిబ్బంది ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలు అటవీ మార్గంలో ఒడిశా వైపు వెళ్లినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో సప్పర్ల, ధారకొండ ఘాట్ రోడ్డు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బైక్‌లపై ఒంటరిగా ప్రయాణించవద్దని సూచించారు.

గతంలో సైతం తిరుమలకు కాలి నడకన చేరుకొనే క్రమంలో చిరుత దాడిలో బాలిక మరణించింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కుటుంబం శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి తిరుమల కొండకు నడక మార్గంలో బయల్దేరింది. ముగ్గురు చిన్నారులతో వెళ్తున్న కుటుంబ సభ్యుల్లో అరేళ్ల వయసున్న లక్షిత నడకమార్గంలో అదృశ్యమై మరోసాటి రోజు మృతదేహంగా కనిపించింది.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి సహకారం కావాలని.. ఏపీకి వివిధ పథకాల కింద నిధులు మంజూరు కావాల్సిన మొత్తం గురించి అభ్యర్ధించారు. అదే విధంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు.. ఏపీ ప్రతిపాదనల పైన వివరించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన అంశాల పైన సీఎం సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications